ఈ నెల 13వ తేదీన విధుల్లో అత్యుత్తమైన ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందిని వైజాగ్ రౌండ్ టేబుల్ సంస్థ ఘనంగా సత్కరించనుంది. లాభాపేక్ష లేకుండా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రతినిధులు తెలిపారు. గత నాలుగేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని... హోంగార్డు నుంచి ఇన్స్‌స్పెక్టర్ స్థాయిలో ఉన్న 25 మంది సిబ్బందిని నగర పోలీసు కమిషనర్ సహాయంతో ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. వారిని బీచ్ రోడ్డులో ఉన్న 'ది పార్క్' హోటల్లో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ మహేష్ లడ్డా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు.
అత్యుత్తమ పోలీసులకు 'నైట్ ఖాకీ' అవార్డులు
విధి నిర్వహణలో అత్యుత్తమైన ప్రతిభ కనబరిచిన 25 మంది పోలీసు సిబ్బందిని ఈ నెల 13వ తేదీన ఘనంగా సత్కరించనున్నట్లు వైజాగ్ రౌండ్ టేబుల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.