కోడి మాంసం ఉత్పత్తులకు కరోనా వైరస్‌తో ముడిపెట్టి... సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారంతో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోందని ఉత్తరాంధ్ర బ్రాయిలర్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. విశాఖలో పౌల్ట్రీ నిర్వాహకులు మాట్లాడారు. కోడి మాంసం, గుడ్ల ద్వారా కరోనా వైరస్ సంక్రమిస్తుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వివరించారు. ప్రజలంతా నిర్భయంగా కోడి మాంసం, గుడ్లు తినవచ్చని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి రాజధాని కోసం భూములిచ్చాం...ఎందుకు వెనక్కి తగ్గుతాం?