భారత నౌకాదళం రాంబిల్లిలో చేపట్టిన ప్రత్యామ్నాయ నావికా స్థావరం (NAOB) ప్రాజెక్టులో అర్హులైన నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను జిల్లా సంయుక్త కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నౌకాదళం, రెవెన్యూ, ఇరిగేషన్, మత్స్యశాఖ అధికారులతో సమావేశమై చెల్లింపుల పురోగతిపై సమీక్ష జరిపారు.
ఎన్‌ఏవోబీ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని సమస్యలపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి తక్షణమే నివేదిక అందజేయాలన్నారు. గతంలో ప్రభుత్వం ప్రకటించిన మేరకు అర్హులైన వారికి ఎక్కడైనా చెల్లింపులు నిలిచిపోతే వెంటనే ఆయా మొత్తాలను అందించాలని ఆదేశించారు. సమీక్షలో పలువురు నౌకాదళ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి..
Notice: పరీక్షలు రద్దు చేయని ఏపీ సహా 4 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు