ETV Bharat / city

jawad effect on vishaka coast: విశాఖ తీరాన ‘అల’జడి! - jawad effect in vishaka

jawad effect: విశాఖ తీరంలో శనివారం రాత్రి సముద్ర అలలు బీభత్సం సృష్టించాయి. జవాద్‌ తుపాను కారణంగా మూడు రోజులుగా ఇక్కడ అలల తాకిడి ఎక్కువగా ఉంది. తుపాను దిశ మార్చుకొని ఒడిశా వైపు పయనించడంతో నగరానికి ముప్పు తప్పిందని భావిస్తుండగా.. రాత్రి వేళ కెరటాలు బీభత్సం సృష్టించాయి.

jawad effect on vishaka coas
jawad effect on vishaka coas
author img

By

Published : Dec 6, 2021, 6:59 AM IST

jawad effect: విశాఖ తీరంలో శనివారం రాత్రి సముద్ర అలలు బీభత్సం సృష్టించాయి. జవాద్‌ తుపాను కారణంగా మూడు రోజులుగా ఇక్కడ అలల తాకిడి ఎక్కువగా ఉంది. తుపాను దిశ మార్చుకొని ఒడిశా వైపు పయనించడంతో నగరానికి ముప్పు తప్పిందని భావిస్తుండగా.. రాత్రి వేళ కెరటాలు బీభత్సం సృష్టించాయి. బీచ్‌రోడ్డులోని నోవాటెల్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న పిల్లల పార్కు నుంచి దుర్గాలమ్మ గుడి వరకు సుమారు 200 మీటర్ల దూరం తీరాన్ని ధ్వంసం చేశాయి. పార్కు గోడ కూలిపోయింది. భూకంపం తర్వాతి పరిస్థితిని తలపించేలా నేల చీలిపోయి పచ్చిక బయళ్లు కిందకు కుంగిపోయాయి. అప్రమత్తమైన పోలీసులు ఆదివారం ఆ ప్రాంతంలో రాకపోకలను నిషేధించారు. సందర్శకులను అనుమతించలేదు.

సముద్రం వైపు కుంగిన పార్కులోని ప్రాంతం

వెనక్కి తగ్గిన సాగరం..

తుపాను అలజడి తగ్గడంతో తీరంలో అలలు కాస్త వెనక్కి వెళ్లాయి. దీంతో విశాఖపట్నం తీరంలోని తెన్నేటి పార్కు సమీపానికి గత ఏడాది కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్‌ నౌక అడుగుభాగం మొత్తం బయటకి కన్పిస్తోంది. దీంతో సందర్శకులు నౌక చెంతకు వెళ్లి ఫొటోలు దిగుతున్నారు. సముద్రపు నీటిలో మునిగి ఉండే రాళ్లు సైతం బయటపడి ఆకట్టుకుంటున్నాయి.

ఇదీ చదవండి:

'దేశాభివృద్ధికి వారిని జవాబుదారీగా చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.