విశాఖ ఎం.పి.అభ్యర్థి వి.వి.లక్ష్మీనారాయణ జనసేన ఒక నిశ్శబ్ధ ప్రభంజనం సృష్టిస్తుందని విశాఖ లోక్సభ అభ్యర్థి వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఇతర పార్టీ నాయకులు, అభ్యర్థులు తిట్టుకుంటూ ప్రచారం చేస్తున్నారని,... తాము మాత్రం కథలను చెప్పుకుంటూ ముందుకెళ్తున్నామని చమత్కరించారు. రానున్న ఎన్నికల్లో 88 అసెంబ్లీ, 15 ఎంపీ సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని.. అధికారంలోకి రాగానే నీటి నిపుణుల సలహాలను తీసుకొని స్ధానిక జలాశయాలను పునరుద్ధరిస్తామన్నారు. గాజువాకను స్మార్ట్ నియోజవర్గంగా రూపొందిస్తామన్నారు.
ఇదీ చదవండి
8 రోజులు బాగా కష్టపడండి: చంద్రబాబు