ఆంధ్రా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనికి మేతకు వచ్చిన పశువులను చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. వర్సిటీ వద్ద జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ భద్రత అధికారిగా ఉన్న ఖాన్ నేతృత్వంలోని బృందం.. దాణా కోసం వచ్చే పశువులను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నట్లు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు.
విశ్వవిద్యాలయ పరిధిలో ఎక్కువగా యాదవులు ఉండటం వల్ల వారి పశువులు యూనివర్సిటీలో మేతకు వెళ్తుంటాయి. పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న రైతుల ఆవులను బంధించడమే కాకుండా రైతుల పట్ల కర్కశంగా ప్రవర్తించడం సమంజసం కాదన్నారు. గోవులను విడిచి పెట్టేందుకు డబ్బు వసూలు చేస్తున్నప్పటికీ విడిచిపెట్టకుండా మూగజీవుల మృతికి కారకులైన భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వర్సిటీ వద్ద నినాదాలు చేశారు. ఈ విషయంపై గవర్నర్కు సైతం ఫిర్యాదు చేస్తామన్నారు. అనంతరం మృతి చెందిన గోవులకు నివాళులర్పించారు.
ఇదీ చదవండి.. Viveka murder case: వివేకా హత్య కేసులో నా ప్రమేయం లేదు: ఎర్ర గంగిరెడ్డి