కాపు నేస్తం, కాపు కార్పొరేషన్ కింద వేల కోట్లు ఖర్చు పెట్టామని ప్రభుత్వం కాపులను తప్పుదోవ పట్టిస్తోందని జనసేన నేత శివశంకర్ ఆరోపించారు. కాపు కార్పొరేషన్తో ఇతర కార్పొరేషన్ల నిధులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారన్నారు. ఈ విషయంపై వైకాపా నేతలు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా మంత్రులు అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసినప్పుడల్లా ఏదో పథకం తెరపైకి తెచ్చి ఉద్యమాన్ని నీరుగార్చారని విమర్శించారు. గత ప్రభుత్వాలన్నీ రిజర్వేషన్ పేరిట కాపులను మభ్యపెట్టి అధికారం చేపట్టాయన్నారు. అధికారంలోకి వచ్చాక సమస్యను పక్కదోవ పట్టించేవారని శివశంకర్ విమర్శించారు.
ఇదీ చదవండి : జులై కోటా శ్రీవారి దర్శన టికెట్లు రేపు విడుదల