కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజ్ సమీపంలో జనవిజ్ఞాన వేదిక సభ్యులు సూర్యగ్రహణాన్ని వీక్షించారు. ఆకాశం మేఘావృతం కావటంతో గ్రహణం పూర్తి స్థాయిలో కనపడలేదని వారు చెబుతున్నారు. గ్రహణం రోజు సూర్యుని నుంచి నీలలోహిత కిరణాలు నేరుగా భూమిపై పడతాయని వారు తెలిపారు.
- విజయనగరం జిల్లాలో
అంగుళ్యాకార సూర్య గ్రహణం ఆకాశంలో జరుగుతున్న ఒక అద్భుతంగా జన విజ్ఞాన వేదిక అభిప్రాయపడింది. ఈ గ్రహాణానికి కరోనాతో సంబంధముందని, గ్రహణ సమయంలో ఏమి తినకూడదని ఇలాంటి మూఢ నమ్మకాలను పట్టించుకోవద్దని జన విజ్ఞాన వేదిక పేర్కొంది. అశాస్త్రీయ భావనలు, ప్రచారం చేస్తున్న వారు రాజ్యాంగంలో ఉన్న 51వ(హెచ్) అధికారానికి వ్యతిరేకులని, ప్రభుత్వాలు వారిపై చర్యలు తీసుకోవాలని జన విజ్ఞాన వేదిక జాతీయ సభ్యులు కోరారు.
ప్రకృతిలో ఉన్న గ్రహాల తిరగడం ద్వారా మాత్రమే రేయింబవళ్లు ఏర్పాడుతున్నాయని.. ఇలా పెరుగుతున్న క్రమంలో చంద్రుడు... భూమికి, సూర్యుడికి మధ్యలో వచ్చిన సమయంలో ఆ నీడలో భూమిపైన ఉన్న వారికి సూర్యుడు కనబడకపోవడమే సూర్యగ్రహణమని జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ పేర్కొన్నారు.
విశాఖ జిల్లాలో
విశాఖ జిల్లాలో ఆకాశం మేఘావృతమవ్వటంతో నగర వాసులు వలయాకార సూర్య గ్రహణం వీక్షించే అవకాశం లేకుండా పోయింది. గ్రహణం వల్ల రోడ్లపై జన సంచారం తక్కువగా ఉంది. ఎవరికి వారే తమ ఇళ్లలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేస్తున్నారు. విశాఖ బీచ్‌లో కొందరు గ్రహ జపాలు నిర్వహించారు. సాధారణంగా నగర వాసులు గ్రహణ పట్టు, విడుపు సమయంలో బీచ్‌లో సముద్ర స్థానాలు ఆచరిస్తారు. కరోనా కారణంగా బీచ్‌కి వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. విశాఖలోని సింహచల దేవస్థానం, కనకమహాలక్ష్మి దేవస్థానం, బీచ్ లో కాళీ మాత ఆలయం కూడా గ్రహణ కారణంతో మూసివేశారు.
ఇదీ చదవండి: కృష్ణా జిల్లాలో యువకుడు దారుణ హత్య