జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అవసరమైన పత్రాల కోసం విశాఖలోని తహసీల్దారు కార్యాలయాల చుట్టూ జేఈఈ పరీక్షలు రాసిన విద్యార్థులు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. విద్యా సంవత్సరం మొదటిలో వివిధ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తహసీల్దార్ కార్యాలయంలో పొందాల్సి ఉంటుంది. కానీ కరోనా వల్ల జాతీయ ప్రవేశ పరీక్షలు ఆలస్యం కావటంతో ఇప్పుడు విద్యార్థులు కుల, ఆదాయ పత్రాల కోసం తహసీల్దారు కార్యాలయం బాట పట్టారు.
అయితే ధ్రువీకరణ పత్రాల జారీ ఆలస్యం అవుతోంది. దీనివల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో ప్రత్యేక సిబ్బందిని నియమించి పత్రాల జారీ వేగవంతం చేయాలనీ కోరుతున్నారు