ETV Bharat / city

పెనుగాలుల విధ్వంసం.. ప్రమాదపు అంచుల్లోకి దక్షిణ విద్యుత్​ గ్రిడ్​ - పరవాడలో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం

NTPC SIMHADRI: దక్షిణాది రాష్ట్రాలు అంధకారంలోకి వెళ్లే పరిస్థితి తృటిలో తప్పింది. విశాఖలోని లైన్లలో సాంకేతిక సమస్య తలెత్తడంతో సింహాద్రి, హిందుజాలో ఉత్పత్తి నిలిచిపోవడంతో దక్షిణ విద్యుత్‌ గ్రిడ్‌ ప్రమాదపు అంచుల్లోకి వెళ్లింది. ఇదే సమయంలో వర్షంతో విద్యుత్‌ డిమాండ్‌ తగ్గడం, జాతీయ గ్రిడ్‌ నుంచి కొంత విద్యుత్‌ అందుబాటులోకి రావడంతో గ్రిడ్‌కు సమస్య రాకుండా చూశారు. ఇంతటి ఇబ్బందికి కారణమైన సాంకేతిక సమస్యను ఇప్పటి వరకు అధికారులు గుర్తించలేదు.

పెనుగాలుల విధ్వంసం.. విద్యుత్తు ఉత్పత్తికి ఆటంకం

author img

By

Published : May 3, 2022, 8:46 PM IST

Updated : May 4, 2022, 4:29 AM IST

దక్షిణాది రాష్ట్రాలు మొత్తం అంధకారంలోకి వెళ్లే ప్రమాదం కొద్దిలో తప్పింది. మంగళవారం తెల్లవారుజామున దక్షిణ గ్రిడ్‌ ఫ్రీక్వెన్సీ 49.8కు పడిపోయింది. సుమారు 2గంటల 21 నిమిషాల పాటు అదే స్థితి కొనసాగింది. విశాఖలో మంగళవారం వేకువజామున తీవ్రమైన గాలులు, పిడుగులు, వర్షం కారణంగా ట్రాన్స్‌కో నెట్‌వర్క్‌ దెబ్బతినడంతో ఈ పరిస్థితి తలెత్తింది. గ్రిడ్‌ ఫ్రీక్వెన్సీ పడిపోకుండా చూడటానికి అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గ్రిడ్‌ ఫ్రీక్వెన్సీ మరో 0.05 శాతం తగ్గినట్లయితే దక్షిణ గ్రిడ్‌ దెబ్బతిని దక్షిణాది మొత్తం గాఢాంధకారంలో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడేది. సాధారణ పరిస్థితుల్లో గ్రిడ్‌ ఫ్రీక్వెన్సీ 50.05 నుంచి 49.9 శాతం మధ్య ఉండాలి. అది 49.75కు తగ్గిందంటే మాత్రం విద్యుత్‌ సరఫరా నెట్‌వర్క్‌ దెబ్బతింటుంది. అలా ఫ్రీక్వెన్సీ ప్రమాదం అంచుల వరకు వచ్చి ఆగింది.

మంగళవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో విశాఖలో భారీ వర్షం, పిడుగుల కారణంగా కలపాక సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఉత్పత్తి కేంద్రాలతో గ్రిడ్‌కు అనుసంధానం చేసే నెట్‌వర్క్‌ దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో బస్‌బార్‌లు అంటే గ్రిడ్‌కు విద్యుత్‌ నిలిచిపోయిన సమయంలో థర్మల్‌ యూనిట్లు దెబ్బతినకుండా ట్రిప్‌ చేసే వ్యవస్థ పనిచేయటంతో అనకాపల్లి జిల్లా పరవాడలోని సింహాద్రి ఎన్టీపీసీ, విశాఖలోని హిందూజా థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో దాదాపు 3వేల40 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఒక్కసారిగా నిలిచిపోయింది. దీని ప్రభావంతో విశాఖ జిల్లా మొత్తానికి సుమారు నాలుగు గంటలపాటు విద్యుత్‌ ఆగిపోయింది. మంగళవారం ఉదయం 6గంటల 30 నిమిషాల నుంచి దశలవారీగా సరఫరాను పునరుద్ధరించారు.

సింహాద్రి, హిందుజా నుంచి ఉత్పత్తి నిలిచిపోయిన సమయంలో ఊహించని విధంగా పవన విద్యుత్‌ సుమారు 1,800 మెగావాట్లు అందుబాటులోకి వచ్చింది. ఇదే సమయంలో వర్షం వల్ల వాతావరణం చల్లబడటంతో విశాఖ విద్యుత్‌ డిమాండ్‌ 1000 నుంచి 700 మెగావాట్లకు తగ్గింది. దీంతో గ్రిడ్‌ ఫ్రీక్వెన్సీ సర్దుబాటు చేయడంతో పాటు డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయడం సాధ్యమైంది. దీనికితోడు జాతీయ గ్రిడ్‌ నుంచి కొంత విద్యుత్‌ అందుబాటులోకి రావడంతో గ్రిడ్‌కు సమస్య రాకుండా చూశారు. అసలు ఈ ఉత్పాతానికి కారణమైన సాంకేతిక సమస్యను ఇప్పటి వరకు అధికారులు గుర్తించలేదు. కలపాక సబ్‌ స్టేషన్‌ పరిధిలో సుమారు 220 కిలోమీటర్ల విద్యుత్‌ లైన్లు ఉన్నాయి. వాటిలో ఎలాంటి సమస్య కనిపించలేదు.

నాలుగు గంటలపాటు చీకట్లు: విశాఖ నగరంతోపాటు అనకాపల్లి జిల్లాలోని అన్ని గ్రామాలూ మంగళవారం ఉదయం దాదాపు 4 గంటలపాటు అంధకారంలో మగ్గాయి. 2014లో హుద్‌హుద్‌ తుపాను తర్వాత మొదటిసారిగా ఎన్టీపీసీలోని 4 యూనిట్లలోనూ ఒకేసారి ఉత్పత్తి నిలిచిపోయింది. ప్లాంటుకు సరఫరా నిలిచిపోవడంతో ఎన్టీపీసీ మొత్తం అంధకారంలోకి వెళ్లిపోయింది. జనరేటర్లతో దీపాలను వెలిగించి మిషనరీని రన్నింగ్‌లో ఉంచారు. ఒకటో యూనిట్‌లో లైటప్‌ చేసి ఉత్పత్తిని ప్రారంభించామని, మిగతా యూనిట్లలోనూ ఉత్పత్తికి సిద్ధం చేశామని ఎన్టీపీసీ వర్గాలు చెబుతున్నాయి. విద్యుత్తు లైన్‌ ట్రిప్‌ కావడానికి గల కారణాలు తేల్చడానికి జాతీయ గ్రిడ్‌ నుంచి ఉన్నతాధికారుల కమిటీ పరిశీలనకు రానున్నట్లు తెలిసింది.

ఇదీచదవండి: Paritala Sriram fire on police: అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు అడ్డుకోవడం సరికాదు: పరిటాల శ్రీరామ్

Last Updated : May 4, 2022, 4:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.