ఆంధ్ర విశ్వవిద్యాలయ భూవిజ్ఞాన శాస్త్ర విభాగంలో విధులు నిర్వర్తించి.. ఉద్యోగ విరమణ చేసిన ఆచార్య నందిపాటి సుబ్బారావుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం, నెదర్లాండ్స్‌కు చెందిన ఎల్సెవియర్ ప్రచురణ సంస్థ భాగస్వామ్యంతో ప్రపంచంలోని వివిధ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రెండు శాతం మంది అత్యుత్తమ శాస్త్రవేత్తల పేర్లతో ఇటీవల విడుదల చేసిన జాబితాలో ఆయనకు స్థానం దక్కింది. భారతదేశం నుంచి 3,352 మంది స్థానం సంపాదించారు. వారిలో సుబ్బారావుకు 506వ ర్యాంకు దక్కింది. గత సంవత్సరం 557వ ర్యాంకును సాధించారు.
భూ విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన అనేక అంశాలపై ఆయన పలు పరిశోధన పత్రాలు సమర్పించారు. హైడ్రోజియాలజీకి సంబంధించిన అంశాలపై వందకు పైగా పరిశోధన పత్రాలు రాసి ‘లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించారు.
ఇదీ చదవండి : రైల్వే స్టేషన్లను పరిశీలించిన.. జీఎం గజానన్ మాల్యా