కరోనా బారినపడి కోలుకున్న రోగులకు.. వైద్యులు, నర్సులు అందించిన పునర్జన్మ మరువరానిదని విశాఖ నగర పాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. విమ్స్, అరిలోవా ఆస్పత్రుల్లో నిర్వహించిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవాలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. కొవిడ్ బాధితులకు నర్సింగ్ సిబ్బంది అందిస్తున్న సేవలు ఉన్నతమైనవిగా అభివర్ణించారు.
అత్యవసర వైద్య విభాగాల్లో విశిష్ఠ సేవలందిస్తూ.. ప్రాణాలను పణంగా పెట్టిన నిస్వార్థ దేవతలని కొనియాడారు. విమ్స్ ఆస్పత్రిలో ఏంజిలిన్ చిత్రపటానికి పూలమాలవేసి, స్టాఫ్ నర్సులు, నర్సింగ్ సిబ్బందికి మేయర్ అభినందనలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి నర్సులకు తినిపించారు. విశిష్ఠ సేవలు అందించిన నర్సులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో విమ్స్ సంచాలకులు డాక్టర్ రాంబాబు, ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ అనిత తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: