ETV Bharat / city

ఆపద వేళ ఆత్మీయ స్పర్శ

వారి సేవలు వెలకట్టలేనవి. ఆస్పత్రికి వచ్చే ఎందరో రోగులకు ఉత్తమ సేవలందిస్తూ సాంత్వన చేకూరుస్తున్నారు. వైద్యులు ప్రత్యక్షంగా చికిత్స చేస్తుండగా వారు వెనకుండి రోగులను ఆదుకుంటున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ వార్డుల్లో 24 గంటలపాటు రోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. కుటుంబాలకు దూరంగా ఉండి ఆస్పత్రులకే అంకితమయ్యారు.

nurse day
nurse day
author img

By

Published : May 12, 2021, 9:48 AM IST

ఆరోగ్యం సహకరించక లేవలేని స్థితిలో ఉంటే చేయి అందిస్తారు. నడవలేకపోతే ఊతమిచ్చి నడిపిస్తారు. ఎలాంటి బంధుత్వం లేకపోయినా సపర్యలతో స్వాంతన కలిగిస్తారు. రోగి కోపంతో మాట్లాడుతున్నా సహనంగా విధులు నిర్వర్తిస్తారు.. వారే నర్సులు. దేశమంతటా కరోనా మబ్బులు కమ్మి అయినవాళ్లే చెంతన నిల్చుని సేవలు అందించలేని పరిస్థితుల్లో... ప్రమాదమనీ తెలిసీ ప్రాణాలు నిలబెట్టేందుకు పగలు రాత్రీ తేడా లేకుండా అవిశ్రాంతంగా సేవలందిస్తున్నారు.

రిగ్గా 167 ఏళ్ల క్రితం క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు సేవ చేసేందుకు ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ నర్సుల బృందాన్ని వెంట బెట్టుకుని వెళ్లింది. ఆమె సేవలు వృత్తికి మార్గదర్శకం అయ్యాయని చెబుతూ చేతిలో వెలిగించిన లాంతర్‌ను పట్టుకునే ఓ స్త్రీ బొమ్మని నర్స్‌కు ప్రతీకగా అప్పటి నుంచి పేర్కొంటున్నారు. నైటింగేల్‌ జయంతి సందర్భంగా మే 12న నర్సుల దినోత్సవం నిర్వహిస్తుంటారు. యుద్ధ రంగంలో నాడు నైటింగేల్‌ నర్సుల బృందం అందించిన సేవలకు నేటి నర్సులు అందిస్తున్న సేవలు ఏమాత్రం తీసిపోనివి. ప్రాణాంతకమని తెలిసినా నిర్భయంగా అనేకమంది ఆసుపత్రుల్లో కరోనా రోగులకు సేవలు అందిస్తున్నారు. వైద్యులు నాడిపట్టి రోగికి ఏ చికిత్స ఇవ్వాలో చెబుతారు. ఆ తరవాత నుంచి రోగి బాధ్యతంతా వీరిపైనే పడుతుంది. వారు కోలుకున్న వరకు సపర్యలు చేస్తూనే ఉండాలి.

ఈ బాధ్యతను ఎంతో క్రమశిక్షణతో పూర్తి చేస్తున్నారు జిల్లాలోని నర్సులు. సెలవులు లేకుండా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో వారూ వైరస్‌ కోరలకు చిక్కినా నిబ్బరంగా చికిత్స పొంది కోలుకున్న వెంటనే సేవలకు పునరంకింతం అవుతున్నారు.
జిల్లాలో ఒక బోధనాసుపత్రి, జిల్లా ఆసుపత్రి, మూడు ప్రాంతీయ ఆసుపత్రులు, 16 సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో సుమారు 995 మందికి పైగా స్టాఫ్‌ నర్సులు పనిచేస్తున్నారు. కేజీహెచ్‌లో 1500 పడకలున్నాయి. ఇన్‌పేషెంట్‌, ఔట్‌ పేషెంట్లు కలిపి రోజుకు 3 వేల మందికి పైగా ఈ ఆసుపత్రిలో వైద్యసేవల కోసం వస్తుంటారు. 2019 నాటికి 397 మంది స్టాఫ్‌ నర్సులు పనిచేస్తున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ధైర్యం కోల్పోకుండా వీరందరూ అందిస్తున్న సేవలు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. కింగ్‌జార్జి ఆసుపత్రిలో ఇప్పటి వరకు సుమారు 80 మందికి పైగా నర్సులు కొవిడ్‌ బారిన పడ్డారు.

* ప్రభుత్వ ఛాతి అంటువ్యాధుల ఆసుపత్రిలో 220 పడకలున్నాయి. అంతకు మించే ఇక్కడ రోగులు వచ్చి చేరుతున్నారు. అన్ని పడకలు ఆక్సిజన్‌తో ఉన్నవే. ఇక్కడ 60 సగటున పడకలకు ఒక స్టాఫ్‌ నర్స్‌ విధులు నిర్వహించాల్సి వస్తోంది. వారు క్షణం తీరిక లేకుండా విధులు నిర్వహిస్తున్నారు.

* అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు, అరకులోయ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా కొవిడ్‌ వార్డులు ఏర్పాటు చేశారు. వాటిలో నర్సింగ్‌ సిబ్బందే పీపీఈ కిట్లు వేసుకుని సేవలందిస్తున్నారు.
* అనకాపల్లి ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రిలో 44 మంది నర్సులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రసూతి విభాగం, జనరల్‌, కొవిడ్‌ వార్డులతోపాటు అత్యవసర విభాగంలో వీరి సేవలే కీలకంగా ఉన్నాయి. ఇక్కడ 12 మంది నర్సులు కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు.

వృత్తిపై మమకారం: పాడేరు జిల్లా ఆసుపత్రి ప్రసూతి విభాగంలో సీనియర్‌ నర్సుగా పనిచేస్తున్నారు జవ్వాది సావిత్రి. 2002లో పాడేరు ఆసుపత్రికి బదిలీపై వచ్చారు. సుమారు 18 సంవత్సరాల నుంచి స్థానిక ప్రసూతి విభాగంలో గర్భిణులు, బాలింతలకు సేవలందిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత అక్టోబర్‌లో కొవిడ్‌ వైరస్‌ సోకినా మనోధైర్యంతో జయించారు. ప్రసూతి విభాగంలో రేయింబవళ్లు విధులు నిర్వహిస్తూ సహచర ఉద్యోగులకు ఆదర్శనీయంగా నిలుస్తున్నారు.

నా వంతు సాయం అందించాలని
కరోనా మొదటి దశలో నాలుగు నెలలపాటు వార్డులో రోగులకు సేవలు అందించాను. సెకండ్‌ వేవ్‌లో సేవలకు తిరిగి చేరాను. కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో నా వంతు సాయం అందించాలన్న ఉద్దేశంతో పరిస్థితి తీవ్రంగా ఉన్నా ఆసుపత్రిలో చేరి సేవలు అందిస్తున్నారు. పీపీఈ కిట్లు ధరించి కరోనా రోగులకు కావాల్సిన మందులతోపాటు వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం.

- ఆశాజ్యోతి

ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు..
కరోనా మొదటి దశలో నర్సుగా విధులు నిర్వహించడానికి కొంత ఆందోళన పడ్డాం. రానురాను దీంతో పోరాడటమే శరణ్యమని తెలుసుకుని ఆత్మస్థైర్యం కోల్పోకుండా రోగులకు సేవలు అందిస్తున్నాం. కొవిడ్‌ బారిన పడిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలామందికి నయం అవుతుంది. మా ఇంట్లో నాతో సహా నలుగురు కుటుంబ సభ్యులం కొవిడ్‌ బారిన పడ్డాం. ఇంట్లోనే ఉంటూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని మందులు వాడుతున్నాం.

- స్వాతి, స్టాఫ్‌ నర్స్‌

జాగ్రత్తలు పాటిస్తూ సేవలు

- వీరమ్మ, హెడ్‌నర్సు, అనకాపల్లి ఆసుపత్రి
కొవిడ్‌ సయమంలో మేమంతా ఒకటే నిర్ణయించుకున్నాం జాగ్రత్తలు పాటిస్తూ రోగులకు సేవలు అందించాలని సిబ్బందికి సూచించాం. కొవిడ్‌ బారిన పడి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి ఇలాంటి వారికి వైద్యం అందించడం కత్తిమీద సామే. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా వైద్యులతోపాటు నర్సులూ కొవిడ్‌ బారిన పడాల్సి వస్తుంది. ఇలా చాలామంది వైరస్‌ బారిన పడ్డారు. చికిత్స తీసుకుని తిరిగి విధుల్లో చేరి రోగులకు సేవలు అందిస్తున్నాం. ఈ ఏడాది నర్సుల దినోత్సవాన్ని ఆసుపత్రిలో ఎవరి వార్డులో వారు ఉండి చేసుకోవాలని నిర్ణయించాం.

ఇదీ చదవండి: కొవిడ్​ వ్యాక్సిన్లపై రాష్ట్రాలకు కేంద్రం వెసులుబాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.