ETV Bharat / city

15 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్... ఉచితంగా కాల్స్

దేశంలోనే తొలిసారిగా విశాఖ రైల్వే స్టేషన్​లో ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. కేవలం 15 నిమిషాల్లో ఫోన్​కు 100 శాతం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అంతేకాదు ఎవరికైనా కాల్ చేసుకోవచ్చు. ఈ సేవలన్నీ ఉచితం.

indian railway introduced innovative system to passangers in vishaka railway station

author img

By

Published : Jan 2, 2020, 5:18 PM IST

విశాఖ రైల్వే స్టేషన్​లో హాయ్ ప్రారంభం

విశాఖ రైల్వేస్టేషన్​లో హ్యూమన్ ఇంట్రాక్ట్ ఇంటర్​ఫేస్(హాయ్)ను ఏర్పాటు చేశారు. ఇది స్మార్ట్ డిజిటల్​ కియోస్క్, డిజిటల్ బిల్ బోర్డు కలిపి ఉండేలా సేవలందించే ఓ సిస్టమ్. ఒకటో నంబర్ ప్లాట్​ఫారం మీద ఏర్పాటు చేసిన వీటిని వాల్తేర్ డీఆర్​ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ, స్టీల్ ప్లాంట్ సీఎండీ ప్రదోష్ కుమార్ రత్​లు ప్రారంభించారు. ఇవి రైల్వేకు ఆదాయాన్ని సమకూర్చి... ప్రయాణికుల అవసరాలను తీరుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.

హాయ్ అందించే సేవలు ఇవే

  • 10 నుంచి 15 నిమిషాల్లోనే మొబైల్స్ ఫుల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే ల్యాప్​ట్యాప్స్​కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.
  • ఫోన్లు అందుబాటులో లేని వ్యక్తులు తమ వారికి వీటి ద్వారా ఉచితంగా ఫోన్ చేసుకోవచ్చు
  • రైళ్ల రాకపోకల టైం టేబుల్, ట్రైన్ రన్నింగ్ స్టేటస్​ కియోస్క్​లోని ఎల్​ఈడీ తెరల్లో కనిపిస్తుంది
  • గూగుల్​ మ్యాప్స్, సిటీ మ్యాప్​లు ఇందులో పొందుపరిచారు. ఎక్కడికైనా వెళ్లాలంటే ఆ ప్రాంతం ఎంతదూరంలో ఉందో ప్రయాణికులు తెలుసుకోవచ్చు

కొన్ని షరతులు

ఫ్రీ కాల్స్ సౌకర్యం ఉన్నందున ఫ్రాంక్, బెదిరింపు కాల్స్ చేసేవారిని గుర్తించేందుకు ప్రతి ఒక్కరి ముఖాన్ని ఈ యంత్రం స్కాన్ చేస్తుంది. వారి ఫొటో ఇందులో నిక్షిప్తమవుతుంది. త్వరలోనే వీటిని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని వాల్తేర్ డీఆర్​ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు.

ఇదీ చదవండి:ఉపాధ్యాయిని దారుణ హత్య.. భర్తే హంతకుడు..!

Intro:Ap_Vsp_92_02_Railway_New_Innovation_Vo_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్ : విశాఖ సిటీ
8008013325
( ) విశాఖ రైల్వేస్టేషన్లో హ్యూమన్ ఇంట్రాక్ట్ ఇంటర్ఫేస్ యంత్రాలను ఏర్పాటు చేశారు

Body:ఒకటో నెంబర్ ప్లాట్ ఫారం మీద ఏర్పాటుచేసిన వీటిని వాల్తేర్ డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ్, స్టీల్ ప్లాంట్ సి.ఎం.డి ప్రదోష్ కుమార్ రత్ లు ప్రారంభించారు. ఇవి రైల్వేకు ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు ప్రయాణికుల అవసరాలను తీరుస్తాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.

Conclusion:తక్కువ సమయంలో సెల్ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ చేసుకోవడంతోపాటు టెలిఫోన్ సౌకర్యం కూడా అందించనున్నట్లు వివరించారు. సెల్ ఫోన్లు అందుబాటులో లేని వ్యక్తులు తమ కుటుంబ సభ్యులకు వీటి ద్వారా ఉచితంగా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చని తెలిపారు.

బైట్: ప్రదోష్ కుమార్ రత్, స్టీల్ ప్లాంట్ సి.ఎం.డి.
: చేతన్ కుమార్ శ్రీవాస్తవ్, వాల్తేర్ డిఆర్ఎం.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.