కొన్ని నెలల కిందట.. బీరుట్‌లో అమోనియం నైట్రేట్ సృష్టించిన బీభత్సంతో.. ఆ రసాయన నిల్వలపై ప్రపంచవ్యాప్తంగా మథనం మొదలైంది. మనదేశంలోనూ.. ఆ రసాయనం దిగుమతులు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. భద్రతా ప్రమాణాలను బేరీజు వేసుకుని.. ఒక్క విశాఖ పోర్టుకు మాత్రమే.. అమోనియం నైట్రేట్ దిగుమతికి అనుమతి ఇచ్చారు. నాగ్‌పూర్‌లోని పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేప్టీ ఆర్గనైజేషన్.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా.. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అనుమతి తర్వాతే దిగుమతి, నిల్వ, రవాణా జరుగుతుంది. విశాఖ పోలీసులు ఎన్ఓసీ ఇచ్చాకే.. షిప్పింగ్ కంపెనీలకు వెసులుబాటు ఉంటుంది. ఇలా.. ఏటా లక్షల టన్నుల అమోనియం నైట్రేట్ దిగుమతి, తరలింపు జరిగేది.
విశాఖలో రెండు దశాబ్దాలుగా.. శ్రావణ్ షిప్పింగ్ సంస్థ అమోనియం నైట్రేట్ దిగుమతి, నిల్వ, పంపిణీ చేస్తోంది. బీరుట్ ఘటన తర్వాత.. తనిఖీల్లో అంతా సవ్యంగా ఉందని అధికారులు చెప్పినా.. గోదాములు, నిల్వలు ప్రమాణాలకు అనుగుణంగా లేవని నిపుణులు తేల్చారు. ఫలితంగా.. ఆ సంస్థ గోదాముల్లో ఉన్న 20 వేల టన్నులను తక్షణమే పరిశ్రమలకు తరలించారు. అయితే ఇప్పటికీ సుమారు నాలుగు వేల టన్నుల అమోనియం నైట్రేట్ గోదాముల్లోనే ఉంది. ఈ సమయంలోనే.. శ్రావణ్ షిప్పింగ్ సంస్థకు దిగుమతులు, నిల్వలపై అనుమతులను.. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి.. తాత్కాలికంగా నిలిపివేసింది. నిర్ణీత సమయంలో సమాధానం ఇవ్వనందున పోలీసులు ఎన్ఏసీ రద్దు చేశారు.
విశాఖకు ప్రస్తుతం.. ఎరువుల తయారీ గ్రేడ్‌కు సంబంధించిన నైట్రేటే ఎక్కువగా దిగుమతి అవుతోంది. ఇప్పటికి రెండు నౌకలు అన్ లోడింగ్ కోసం వేచిచూస్తుండగా.. వాటిల్లో ఉన్న రసాయనాన్ని ఎంత తర్వగా తరలిస్తే.. అంత మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే షిప్పింగ్ సంస్థకు ఎన్ఓసీ రద్దుతో.. మరింతకాలం సందిగ్ధత కొనసాగనుంది.
ఇదీ చదవండం: