ETV Bharat / city

ప్రాణాలు తీసిన గుంత.. భార్య కళ్లెదుటే భర్త కన్నుమూత - Bike Accident at Paravada Visakha district

Road Accident: రహదారి మధ్యలో ఏర్పడిన గుంత ఓ వ్యక్తి నిండు ప్రాణాలు బలికొంది. ద్విచక్ర వాహనంపై ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అదుపు తప్పి పడిపోయారు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్యకు గాయాలయ్యాయి.

Road accident
Road accident
author img

By

Published : Apr 3, 2022, 11:44 AM IST

Road Accident: రహదారి మధ్యలో ఏర్పడిన గుంత ఓ వ్యక్తి నిండు ప్రాణాలు బలికొంది. ద్విచక్ర వాహనంపై ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అదుపు తప్పి పడిపోయారు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్యకు గాయాలయ్యాయి. పోలీసులందించి వివరాల ప్రకారం...

Bike Accident: కశింకోట గ్రామానికి చెందిన గంపల నానాజీ (43) ఇంటి వద్ద తన తల్లి సంవత్సరిక కార్యక్రమాలు ముగించుకుని, భార్య దేవి (35)తో కలిసి ముత్యాలమ్మపాలెం తీరంలో సముద్రస్నానానికిి స్కూటీపై బయలుదేరాడు. పరవాడ ఊటగెడ్డకూడలి నుంచి సింహాద్రి ఎన్టీపీసీకి వెళ్లే రహదారి గుండా ప్రయాణిస్తున్నారు.ఎన్టీపీసీ సమీపంలోకి రాగానే అదుపు తప్పి... రహదారిపై ఏర్పడిన గుంతలో ద్విచక్రవాహనం పడింది. బైక్​పై ఉన్న భార్యభర్తలిద్దరూ కింద పడిపోయారు. భర్త తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. భార్యకు గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు వారికి సపర్యలు చేసి, 108లో అగనంపూడి సీహెచ్‌సీకి తరలించారు. నానాజీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. దేవికి ప్రాథమిక వైద్యం చేశారు. కళ్లెదుటే భర్త మృతి చెందడంతో భార్య బోరున విలపించింది. వారికి ఓ కుమార్తె. మృతుడు పరవాడ ఫార్మాసిటీలో కార్మికునిగా పని చేసేవాడు. నానాజీ మృతదేహానికి అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : Bullet Bike Blast: బైక్​లో మంటలు.. భారీ శబ్దంతో పేలుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.