ETV Bharat / city

వాడీవేడిగా హైపవర్ కమిటీ రెండో రోజు సమావేశం

author img

By

Published : Jun 7, 2020, 7:26 PM IST

Updated : Jun 7, 2020, 7:57 PM IST

విశాఖ ఎల్​జీ పాలిమర్స్ ప్రమాదంపై హై పవర్ కమిటీ రెండో రోజు సమావేశం నిర్వహించింది. బాధిత గ్రామస్థులు 21 మందితో పాటు వివిధ రాజకీయ పార్టీలతో హై పవర్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ప్రమాద ఘటనపై బాధిత గ్రామాలను ఏ విధంగా ఆదుకోవాలన్న విషయాలపై గ్రామస్థులతో చర్చించారు. గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న హై పవర్ కమిటీ.. ఇతర రాజకీయ పక్షాల అభిప్రాయాలను తెలుసుకుంది.

వాడీవేడిగా హైపవర్ కమిటీ రెండో రోజు సమావేశం
వాడీవేడిగా హైపవర్ కమిటీ రెండో రోజు సమావేశం

విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వళవన్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ వినయ్​చంద్, పోలీస్ కమిషనర్ ఆర్​.కె మీనా సభ్యులుగా ఉన్న హై పవర్ కమిటీ రెండో రోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.

తెదేపా

అప్రకటిత కర్ఫ్యూ వాతావరణంలో హై పవర్ కమిటీ సమావేశం జరిగిందని, బాధిత గ్రామాలకు దూరంగా కమిటీ సమావేశం నిర్వహించారని తెదేపా నేత, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పీవీజీ గణబాబు అన్నారు. ఈ సమావేశానికి గ్రామస్థులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో అర్థం అవడం లేదన్నారు. కోట్ల రూపాయలు నష్ట పరిహారం ఇచ్చినా బాధిత గ్రామాలలో సంతృప్తి లేదని, అందుకే కట్టుదిట్టమైన భద్రత మధ్య హై పవర్ కమిటీ సమావేశం నిర్వహించారన్నారు. పూర్తి సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, శాశ్వత ప్రాతిపదికన బాధితులను ఆదుకోవాలని గణబాబు హై పవర్ కమిటీని కోరారు.

కాంగ్రెస్​

ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమను తరలించాలని కాంగ్రెస్​ ప్రతినిధులు హై పవర్ కమిటీని కోరారు. పరిశ్రమపై ఆధారపడిన వారి కోసం ఎల్​జీ పరిశ్రమకు చెందిన ఎలక్ట్రానిక్ సంస్థను ఇక్కడ నడపాలని సూచించారు. ఈ ఘటన వల్ల మేఘాద్రి గడ్డ రిజర్వాయర్​లోని నీరు కొంత మేర కలుషితమైందని కమిటీకి విన్నవించారు.

సీపీఐ

సమావేశంలో పాల్గొనేందుకు కలెక్టర్​ కార్యాలయం నుంచి పిలుపు వచ్చినా... మీటింగ్​కు వెళ్లకుండా అడ్డుపడ్డారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి ఆవేదన చెందారు. పోలీస్ వలయంలో హై పవర్ కమిటీ సమావేశం నిర్వహించారన్నారు. 14 మంది మృతికి కారణమైన కంపెనీపై ఏ చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం ఇప్పటికీ చెప్పకపోవడం దారుణమన్నారు.

సీపీఎం

లాక్​డౌన్ సమయంలో ఏ విధంగా ఎల్​జీ పరిశ్రమకు అనుమతి ఇచ్చారో తెలపాలని హైపవర్ కమిటీని సీపీఎం కోరింది. ఘటన జరిగి నెల రోజులవుతున్నా కంపెనీ యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎల్​జీ పాలిమర్స్​ను తరలించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.

ఆమ్ ఆద్మీ

బాధిత గ్రామాలను ప్రభుత్వమే ఆదుకోవాలని, ఎల్​జీ పాలిమర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆప్ పార్టీ హైపవర్ కమిటీని కోరింది.

వైకాపా

బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని వైకాపా ప్రతినిధి మళ్ల విజయ ప్రసాద్​ అన్నారు. ఈ ప్రమాదం వల్ల ఎక్కువ నష్టపోయిన వేంకటాద్రి నగర్ గ్రామస్థులను హై పవర్ కమిటీ కలిసిందని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలను జిల్లా యంత్రాంగం పిలిచిందన్నారు. ఇక్కడ రాజకీయం చేయాలని చూడటం సరికాదన్నారు.

ఇదీ చదవండి : కరోనా నివారణ... ఒక్క SMSతో మాత్రమే సాధ్యం

Last Updated : Jun 7, 2020, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.