విశాఖలోని గీతం విశ్వవిద్యాలయం కట్టడాల విషయంలో నవంబర్ 30వ తేదీ వరకు కూల్చివేతలు చేపట్టొద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది. తమకు చెందిన కట్టడాలను అధికారులు హడావుడిగా కూల్చివేస్తున్నారని పేర్కొంటూ గీతం యాజమాన్యం హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. నిర్మాణాల క్రమబద్ధీకరణ ప్రక్రియ పెండింగ్ లో ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నోటీసు ఇవ్వకుండా హడావుడిగా కూల్చివేత ప్రక్రియ చేపట్టారన్నారు. దీనిపై మరికొన్ని వివరాలు జత చేస్తామని పిటిషనర్ తరఫు న్యాయవాది 10 రోజుల సమయం కోరారు. మరోవైపు కూల్చివేతలపై అఫిడవిట్ దాఖలు చేసేందుకు నాలుగు వారాల సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరటంతో తదుపరి విచారణను నవంబర్ 30వ తేదీకి హై కోర్టు వాయిదా వేసింది. పిటిషనర్‌కు సంబంధించిన భవనాలపై తదుపరి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. తదుపరి విచారణ వరకు నిర్మాణ పనులు చేపట్టవద్దని పిటిషనర్ కు సూచించింది.
ఇదీ చదవండి: