ETV Bharat / city

దాతల ఔదార్యం.. అభాగ్యులకు సహాయం.. - helping to poor people తోూాేూ లాైే గల ోజ

లాక్​డౌన్ కారణంగా ఆకలితో ఇబ్బందులు పడుతున్న పేదలు, అభాగ్యులకు సహాయం అందించేందుకు పలువురు దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు వస్తున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు అందిస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. ఆకలితో అలమటిస్తున్న ఎందరికో అన్నం పెడుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

helping to poor people in ap
helping to poor people in ap
author img

By

Published : Apr 27, 2020, 7:11 PM IST

కరోనా కారణంగా లాక్​డౌన్​ నేపథ్యంలో పేదలు, కూలీలు, అభాగ్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఆకలితో అలమటిస్తూ ఆహారం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. వీరిని ఆదుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సైతం తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు.

విశాఖలో

విశాఖ జిల్లా అనకాపల్లిలో రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లింలకు దాతలు నిత్యావసరాలు పంపిణీ చేశారు. దాదాపు 100 కుటుంబాలకు దాడి వీరు నాయుడు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కొరిబిల్లి రమేష్ ఆధ్వర్యంలో సహాయం అందించారు.

తూర్పుగోదావరిలో

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 550 మంది వికలాంగులకు ఉమా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి చేతుల మీదుగా వీటిని అందించారు.

పారిశుద్ధ్య సిబ్బందికి సహాయం

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో లాక్​డౌన్​లో సేవలందిస్తున్న వందమంది పారిశుద్ధ్య సిబ్బంది, నిరుపేదలకు శ్రీజ విద్యాసంస్థల యాజమాన్యం ఆధ్వర్యంలో మహిళలు సహాయం అందించారు. వ్యక్తిగత దూరం పాటిస్తూ.. నిత్యావసరాలు, గుడ్లు, కూరగాయలు, మాస్కులు పంపిణీ చేశారు.

నెల్లూరులో

నెల్లూరు నగరంలోని పద్మావతి నగర్​లో 5 మంది మహిళలు కలసి పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. దాదాపు 40 మందికి 12
నిత్యావసరాలు అందించారు.

విశాఖ జిల్లాలో

విశాఖ జిల్లా ఎలమంచిలిలోని ప్రైవేట్ జూనియర్ డిగ్రీ కళాశాల యాజమాన్యం కరోనా బాధితులకు సాయం అందించేందుకు స్థానిక ఎమ్మెల్యే కన్నబాబుకు రూ.60 వేలు విరాళం ఇచ్చారు. విశాఖ సేఫ్టీ కౌన్సిల్ ఆధ్వర్యంలో పాత్రికేయులు, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.

విజయవాడలో

విజయవాడలో నిరాశ్రయులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తూ ఆహారం అందిస్తున్నాయి. నగరంలోని యనమలకుదురు ప్రాంతానికి చెందిన అభయహస్త సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు.. రోజు కూలీలు, పంచాయతీ కార్మికులకు ఆహారం అందిస్తున్నారు.

ఇవీ చదవండి:

రెండు ఎన్​కౌంటర్లు- ఏడుగురు ముష్కరులు హతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.