ETV Bharat / city

భారీ వర్షానికి... ఉప్పొంగి ప్రవహిస్తున్న వరహాల గడ్డ

భారీ వర్షానికి విశాఖ పార్వతీపురంలోని వరహాల గడ్డ ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో బైపాస్ కాలనీ ముంపునకు గురైంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

heavy-rains-in-parvathipuram-in-visakha
author img

By

Published : Oct 26, 2019, 3:31 PM IST

భారీ వర్షానికి ఉప్పొంగి ప్రవహిస్తున్న వరహాల గడ్డ
విజయనగరం జిల్లా పార్వతీపురంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. వరహాల గడ్డ ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరహాల గడ్డ నీరు బైపాస్ కాలనీలో చేరడంతో వందలాది ఇళ్లు నీట మునిగాయి. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఇళ్లల్లోకి నీరు చేరడంతో అక్కడివారు జాగారం చేస్తూ గడిపారు. తహశీల్దార్ శివన్నారాయణ, కమిషనర్ ప్రసాదరావు...బైపాస్ కాలనీలో పరిస్థితిని పరిశీలించి.. సహాయక చర్యలు చేపట్టారు. వార్డు మాజీ కౌన్సిలర్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు కాలనీవాసులకు ఆహారం అందజేశారు. ఎప్పుడు వర్షం కురిసినా తమ పరిస్థితి ఇదేనంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ప్రపంచంలోనే ఖరీదైన 'విస్కీ'..ధరెంతో తెలుసా?

Intro:ap_vzm_36_26_by pass_colany_mumpu_avbbbbb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా గడ్డ నీరు కాలనీని చుట్టేసింది మరోమారు వరహాలు గడ్డ పొందడంతో వందలాది ఇళ్లు నీటమునిగాయి

Body:విజయనగరం జిల్లాలో శుక్రవారం రాత్రి ఇ కురిసిన భారీ వర్షానికి కాలనీలు ముంపునకు గురయ్యాయి పార్వతీపురం పట్టణం మధ్య గుండా ప్రవహిస్తున్న వరహాలు గడ్డ ఉప్పొంగింది గడ్డ నీరు బైపాస్ కాలనీ లో చేరడంతో వందలాది ఇళ్లు ముంపునకు గురయ్యాయి రెండు రోజుల వ్యవధిలో కాలనీ మళ్లీ ముంపునకు గురవడంతో ఆ ప్రాంతీయులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు రాత్రి సుమారు రెండు గంటలపాటు భారీ వర్షం కురిసింది ఈ కారణంగా వరహాలు గడ్డ ఉప్పొంగింది బైపాస్ కాలనీవాసులు నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి గడ్డ నీరు కాలనీ చుట్టూ చేరింది ఇళ్లల్లోకి చొరబడి ఉంది కాలనీ వాసులంతా కట్టుబట్టలతో మిగిలారు సామాగ్రి ఇ బట్టలు వంట సామాగ్రి అంతా నీటమునిగాయి తెల్లవారులు జాగారం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు కాలనీలోని ఎస్సీ వాస్తు గృహం పూర్తిగా ముంపునకు గురైంది వృద్ధులు పిల్లలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు తాసిల్దార్ శివన్నారాయణ కమిషనర్ ప్రసాదరావు రావు కాలనీ పరిస్థితిని పరిశీలించారు సహాయక చర్యలు చేపట్టారు వైకాపా నాయకులు బాధితులను పరామర్శించి సహాయ చర్యలు చేపట్టారు వార్డు మాజీ కౌన్సిలర్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు కాలనీవాసులకు ఆహారం ఏర్పాటు చేశారు ఎప్పుడు వర్షం కురిసిన మా పరిస్థితి ఇదే అంటూ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Conclusion:కాలనీలో కి చేరిన వరద నీరు ఇళ్లలోకి నీరు చేరడంతో తడిసి ముద్దైన సామాగ్రి ముంపునకు గురైన వసతిగృహం సహాయక చర్యల్లో యువత పరవళ్లు తొక్కుతున్న వరహాలు గడ్డ ఇళ్లలోకి నీరు చేరడంతో బయట కాలక్షేపం చేస్తున్న నివాసితులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.