పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ వైద్య ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా వీరు పనిచేస్తున్నారు. కార్మిక చట్టాల ప్రకారం తమకు ఇవ్వాల్సిన కనీస వేతనాలు ఇవ్వకపోవడమే కాకుండా అధిక సమయం పని చేయించుకుంటూ... బోనస్లు, టీఏ, డీఏలు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. అంతేకాకుండా ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. జిల్లా అధికారులు ఈ విషయంపై స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి :