ETV Bharat / city

'ఎల్ఆ​ర్​ఎస్, బీపీఎస్​లపై ప్రజలకు అవగాహన కల్పించాలి'

విశాఖలో అక్రమ లేఅవుట్లు, నిర్మాణాల క్రమబద్దీకరణకు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కువ మంది వినియోగించుకునేట్టుగా చూడాలని జీవీఎంసీ నిర్ణయించింది. బీపీఎస్​కు దరఖాస్తు చేసుకోకుంటే అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని హెచ్చరించింది.

Gvmc
Gvmc
author img

By

Published : Oct 16, 2020, 8:51 PM IST

విశాఖ నగరంలో ఎల్ఆ​ర్​ఎస్, బీపీఎస్​లకు గడువు సమీపిస్తున్నందున ప్రజలు దరఖాస్తు చేసుకునేట్టుగా అవగాహన కల్పించాలని జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు. పట్టణ ప్రణాళిక విభాగంలో వివిధ పథకాలకు వచ్చిన దరఖాస్తుల తీరును శుక్రవారం సమీక్షించిన జీవీఎంసీ... అక్రమ లేఅవుట్లు, నిర్మాణాల క్రమబద్దీకరణకు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కువ మంది వినియోగించుకునేట్టుగా చూడాలని నిర్ణయించింది.

ఎల్​ఆర్​ఎస్​కి 1105 దరఖాస్తులు వచ్చాయి. దీనికి డిసెంబర్​ 31తో గడువు ముగియనుంది. బీపీఎస్ కోసం 6166 దరఖాస్తులు రాగా అందులో 5013 అనుమతించారు. 1153 పెండింగ్​లో ఉంచారు. దీనికి అక్టోబర్ 31 ఆఖరి తేదీగా నిర్ణయించారు. నగరంలో ఇంకా 4087 అక్రమ నిర్మాణాలను గుర్తించినట్టు జీవీఎంసీ వివరించింది. వీటికి సరైన రుసుము చెల్లించి బీపీఎస్​లో క్రమబద్దీకరణ చేయించుకోనట్టయితే వాటిని అక్రమ కట్టడాలుగా ప్రకటించి కూల్చివేస్తామని హెచ్చరించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.