ETV Bharat / city

'పరిశుభ్రతలో విశాఖ రైల్వే స్టేషన్ దేశంలోనే మొదటి స్థానం'

విశాఖ రైల్వే స్టేషన్‌లో పారిశుద్ధ్య నిర్వహణ బాగుందని రాజ్యసభ సభ్యులు జీవీఎల్​ నరసింహారావు కితాబిచ్చారు. పరిశుభ్రతలో దేశంలోనే విశాఖ రైల్వే స్టేషన్​ మొదటి స్థానంలో ఉందని అన్నారు.

జీవీఎల్​ నరసింహారావు
జీవీఎల్​ నరసింహారావు
author img

By

Published : Sep 15, 2021, 8:28 PM IST

విశాఖ రైల్వే స్టేషన్‌ను భాజపా ఎంపీ జీవీఎల్‌ సందర్శించారు. ప్లాట్‌ఫామ్స్‌, మౌలిక వసతులు పరిశీలించారు. విశాఖ రైల్వే స్టేషన్‌లో పారిశుద్ధ్య నిర్వహణ బాగుందని కితాబిచ్చారు. పరిశుభ్రతలో దేశంలోనే విశాఖ రైల్వే స్టేషన్‌ మొదటి స్థానంలో ఉందని అన్నారు. త్వరలో రైల్వే స్టేషన్‌లో మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. రూ.600 కోట్లతో విమానాశ్రయాలకు దీటుగా రైల్వే స్టేషన్లను మారుస్తామని స్పష్టం చేశారు.

'ఆచార్య ఎన్​జీ రంగాలో మెడికల్ కళాశాల వద్దు'

విశాఖ జిల్లా అనకాపల్లిలో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడం తగదని జీవీఎల్ నరసింహారావు అన్నారు. వైద్య కళాశాల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని..అయితే నియోజకవర్గంలోనే వేరేచోట ఏర్పాటు చేయాలని సూచించారు. కణజాల విధానంలో చెరుకు విత్తనం రూపొందించడం..ఒకేసారి బెల్లం, పౌడరు, తేనే తయారు చేసే విధంగా చిత్రాన్ని రూపొందించిన శాస్త్రవేత్తలను అభినందించారు. బెల్లం పౌడర్​కు పేటెంట్ హక్కు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

పరిశోధన కేంద్రాన్ని నిర్వీర్యం చేయాలని చూడటం సరికాదని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయడం లేదన్నారు. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. జగన్ సర్కార్ తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు నెపాన్ని కేంద్రంపై నెట్టేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంతో చేస్తుందని.. వాటిని భాజపా కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు.

ప్రధానమంత్రి మోదీ జన్మదినం సందర్భంగా 20 రోజులు కార్యక్రమాలు చేయడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేయడమే కాకుండా సేవా కార్యక్రమాలు చేయాలని కార్యకర్తలకు సూచించారు.

ఇదీ చదవండి: SPICEJET: విశాఖ-ముంబై స్పైస్ జెట్ విమాన సర్వీసు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.