governor visakha tour : రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 20న విశాఖపట్నానికి వెళ్లనున్నారు. ప్రెసిడెన్సియల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు విశాఖ రానున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు 20న సాయంత్రం నావల్ డాక్‌యార్డు వద్ద గవర్నర్ స్వాగతం పలకనున్నారు. 21న నావల్ డాక్‌యార్డులోని ఎన్14ఎ జెట్టీ వద్ద ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతితోపాటు పాల్గొంటారు. అదేరోజు మధ్యాహ్నం రాష్ట్రపతికి గౌరవార్థం ఇచ్చే విందుకు హాజరవుతారు. 22వ తేదీన నావల్ డాక్‌యార్డులో రామ్‌నాథ్ కోవింద్‌కు వీడ్కోలు పలికి తిరిగి విజయవాడకు బయల్దేరి రానున్నారు.
విశాఖ వేదికగా.. ఈనెల 21 నుంచి ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ
శత్రువులను ధైర్యంగా ఎదుర్కొవాలంటే ముందు మన శక్తిసామర్థ్యాలు ఎంత మేరకు ఉన్నాయో తెలిసి ఉండాలి. ఏ మేరకు పోరాడగలమో సమీక్షించుకోవాలి. అలా నౌకాదళ బలాన్ని సమీక్షించేదే ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూ. ఈనెల 21 నుంచి విశాఖ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొంటారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. రాష్ట్రపతిని ఆహ్వానించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
దేశ మెరైన్ అవసరాలకు అనుగుణంగా.. నౌకల నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు నౌకాదళం సన్నద్దంగా ఉండాల్సి ఉంటుంది. ఆ సన్నద్ధతను బేరీజు వేసుకునేందుకు ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ ఒక కొలమానంగా ఉంటుంది. అత్యంత చాకచక్యంగా వ్యవహరించడం, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడం.. మన సత్తా చాటి చెప్పడం.. వంటి అంశాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి.
75 ఏళ్ళ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ సారి ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూను దేశ సేవలో 75 ఏళ్లు అన్న నినాదంతో నిర్వహిస్తున్నారు. 60 నౌకలు, సబ్ మెరైన్లు, 50కి పైగా ఎయిర్ క్రాప్టులతో ముఖ్య విన్యాసాలు నిర్వహించనున్నారు. ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూలోని నౌకా విన్యాసాలను ఆర్కే బీచ్ నుంచి ప్రజలు సైతం వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి :