తూర్పు నౌకాదళంలోని ఐఎన్ఎస్ సహ్యాద్రి.. 2020 సంవత్సరానికి గాను ఉత్తమనౌక అవార్డును(FLEET AWARD) సాధించింది. వివిధ అపరేషన్లలో గతేడాది కీలక పాత్ర పోషించిన తూర్పు నౌకాదళంలోని యుద్ద నౌకలకు అవార్డుల ప్రదాన కార్యక్రమం విశాఖలో జరిగింది. ఫ్లీట్ అవార్డుల ప్రదానోత్సవానికి తూర్పునౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఎబి.సింగ్ హాజరై అవార్డులను ప్రదానం చేశారు. తూర్పు నౌకాదళంలోని 16 వివిధ విభాగాలకు చెందిన నౌకలు, యూనిట్లు అవార్డులకు ఎంపిక చేశారు. ఐఎన్ఎస్ కమోర్ట.. ఉత్తమ స్ఫూర్తి దాయక నౌకగా ట్రోఫీని సాధించింది. ఉత్తమ కర్వెట్టి నౌకల అవార్డును కిల్తాన్, కుక్రీలు సంయుక్తంగా ఎంపికయ్యాయి.
కొవిడ్ ప్రపంచమంతటా విజృంభించిన వేళ తూర్పునౌకాదళం పలు సవాళ్లనే ఎదుర్కొవాల్సి వచ్చింది. ఒక వైపు ఎటువంటి పరిస్ధితులనైనా ఎదుర్కొనే యుద్ద సన్నద్దతతో పాటు, మానవీయ సహాయంలోనూ.. ఈ నౌకలు అగ్రస్ధానంలో నిలిచాయి. వివిధ దేశాలతో సంయుక్త విన్యాసాలలో తూర్పు నౌకాదళ యుద్ద నౌకలు తమ సామర్ధ్యాన్ని ప్రదర్శించాయి. పేసెక్స్, మలబారు వంటి సంయుక్త విన్యాసాలలో పాలు పంచుకున్నాయి. సముద్ర సేతు కింద విదేశాల్లో ఉన్న వారిని భారత్ కు తీసుకురావడమే కాకుండా, మలిదశలో ఇతర దేశాల నుంచి సాయాన్ని, వైద్య పరికరాలను స్వదేశానికి తీసుకొచ్చి తమ సామర్ధ్యాన్ని చూపాయి.
ఇవీ చదవండి: