fire accident in a car shed workshop at visakhapatnam: విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి తర్వాత కార్ షెడ్ వర్క్ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ఆర్టీవో ఆఫీస్ వెనుక ఉన్న వర్కషాపులో జరిగిన ప్రమాదంలో ఏడు కార్లు పూర్తిగా దగ్ధం కాగా.. ఒకటి దెబ్బతింది.
రాత్రి విధుల్లో ఉన్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని నివారణ చర్యలు చేపట్టారు. ఏసీపీ బాబ్జి.. అగ్నిమాపక, విద్యుత్ అధికారులను సమన్వయం చేసి ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో సుమారు రూ. 20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు.
HC ON GO: జీవోలను వెబ్సైట్లో పెట్టకపోవడంపై హైకోర్టు ఆగ్రహం