ETV Bharat / city

అప్పట్లో చరిత్రకెక్కారు...ఇప్పుడు మళ్లీ పోటీకి దిగారు!

విశాఖ జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్​ పీఠమెక్కిన తొలి గిరిజన మహిళగా గతంలో రికార్డు స్పష్టించిన వంజంగి కాంతమ్మ.... మరోసారి ఆ పదవికి పోటీపడుతున్నారు. జడ్పీటీసీ స్థానానికి నామినేషన్​ దాఖలు చేశారు. తాను చేసిన అభివృద్దే మళ్లీ విజయ తీరాలకు చేరుస్తుందని ఈటీవీ భారత్​తో ముఖాముఖిలో ఆమె అన్నారు.

vanjangi kanthamma
vanjangi kanthamma
author img

By

Published : Mar 12, 2020, 11:25 AM IST

వంజంగి కాంతమ్మతో ముఖాముఖి

విశాఖ జిల్లా ఛైర్​పర్సన్​ పదవి రెండోసారి గిరిజన మహిళకు రిజర్వ్ అయింది. 2001, 2020లో ఎస్​టీ మహిళకు కేటాయించారు. సుమారు 19 సంవత్సరాల తరువాత విశాఖ జిల్లా జడ్పీ పీఠం గిరిజన మహిళకు కేటాయించారు. 2001 ఎన్నికల్లో జడ్పీ ఛైర్​పర్సన్​గా పీఠమెక్కారు వంజంగి కాంతమ్మ. జిల్లాలో ఆ పదవిని పొందిన తొలి గిరిజన మహిళగా ఆమె చరిత్రకెక్కారు. ఇప్పుడు మరోసారి జడ్పీ ఛైర్​ పర్సన్​ పదవికి బరిలోకి దిగారు. జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలకు వెళ్తున్నారు. తాను గిరిజన ప్రాంతాలకు చేసిన అభివృద్ధిని ప్రజలు దృష్టిలో పెట్టుకుని మంచి గెలుపు ఇస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలలో 39 జడ్పీటీసీ స్థానాలకు గాను 314మంది అభ్యర్థులు నామినేషన్లు ధాఖలు చేశారు. రెండురోజులు పాటు పరిశీలన జరిగిన తరువాత ఉపసంహరణకు అభ్యర్థులకు సమయం ఉంది. అభ్యర్థుల జాబితా ముద్రించి ఈ నెల 21న ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

ఇదీ చదవండి:నామినేషన్ల గడువు పెంచండి.. ఈసీకి చంద్రబాబు లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.