ETV Bharat / city

International Yoga Day: అన్నీ.. ఉప'యోగా'లే!

ప్రపంచ మానవాళి ఆరోగ్యాన్ని కాపాడే అస్త్రంగా 'యోగా'ను.. నిపుణులు అభివర్ణిస్తున్నారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో రోగనిరోధకశక్తిని పెంచడమే కాదు.. శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోకరమని చెబుతున్నారు. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. యోగా ప్రాధాన్యతపై ప్రత్యేక కథనం.

YOGA
యోగా వల్ల ఉపయోగాలు నిపుణులు
author img

By

Published : Jun 21, 2021, 7:54 AM IST

యోగా ప్రాధాన్యతపై ప్రత్యేక కథనం

ప్రపంచ దేశాలకు భారతదేశం అందించిన గొప్ప ఆరోగ్య బహుమతి యోగా. శరీరం, మనసును క్రమపద్ధతిలో నియంత్రించే క్రియల సమ్మేళనమే 'యోగా' గా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వందల ఏళ్ల క్రితం పుట్టిన యోగా గురించి పురాణాలలోనూ ప్రస్తావించారని గుర్తు చేస్తున్నారు. ఆధునిక కాలంలో శారీరక, మానసిక సమస్యలతో సతమతమవుతున్న మానవాళికి యోగా చక్కని పరిష్కారమార్గం. ఈ ప్రాముఖ్యతను గమనించే ఇప్పుడు ఇతర దేశాల్లోనూ యోగాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటివరకు యోగాను అభ్యసించనివారు.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆచరణ ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు.

యోగాను దైనందిక జీవితంలో భాగం చేసుకుంటే ఎలాంటి ఆందోళనలు దరిచేరవని నిపుణులు అంటున్నారు. క్రమం తప్పకుండా యోగా చేస్తే సత్ఫలితాలుంటాయని చెబుతున్నారు. - లావణ్య, యోగా నిపుణురాలు

ఆధునిక వైద్యశాస్త్రాంలో అంతుచిక్కని సమస్యలకు యోగాలో పరిష్కారం లభిస్తుందని... నిపుణులు తెలియజేస్తున్నారు. శారీరక, మానసిక రుగ్మతలను రూపుమాపేందుకు ప్రస్తుతం యోగా విధానాలు అన్వేషిస్తున్నారని అంటున్నారు. - డాక్టర్ శ్రీకృష్ణ చందక, డైరెక్టర్, విశాఖ సొసైటీ ఫర్ యోగా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్.

ఇదీ చదవండి:

Vaccination record: కొవిడ్ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం సరికొత్త రికార్డు

Office timings: ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో మార్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.