కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసమే బీసీ కార్పొరేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఆదివారం విశాఖలోని తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికే ప్రభుత్వం అప్పులు చేస్తోందన్న ఆయన... ఈ కార్పొరేషన్లకు ఏ విధంగా నిధులు కేటాయిస్తుందని ప్రశ్నించారు. 56 బీసీ కార్పొరేషన్లకు కార్యాలయాలు, ఛైర్మన్లకు కుర్చీలు అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదా అని అడిగారు. ఇది కేవలం రాజకీయ ఎత్తుగడ అని ఆయన ఆరోపించారు.
మరోవైపు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉందని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. తితిదే బంగారంపై ఈ సర్కార్ కన్ను వేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి పద్ధతి మార్చుకోవాలని అయ్యన్న అన్నారు.
ఇదీ చదవండి