తెలుగుదేశం పార్టీతోనే మహిళా సాధికారత సాధ్యమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మహిళా దినోత్సవాన్ని శనివారం రాత్రి తెదేపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్ని అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ మహిళలకు ఆస్తిలో సగం భాగం కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేశారని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారన్నారు.
తెదేపా అభ్యర్థులను గెలిపించాలి
9నెలల వైకాపా పాలనలో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా అభ్యర్ధులను గెలిపించి ముఖ్యమంత్రి జగన్ కళ్లు తెరిపించాలన్నారు. ఎమ్మెల్యే, పార్టీ నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ రానున్న స్థానిక పోరుకు సిద్ధమవాలన్నారు. తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ మహిళలంతా తెదేపా అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలన్నారు.
ఇదీ చదవండి : సభా వేదికపై కన్నీరు పెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి