ETV Bharat / city

Ayurvedam: మన జీవన శైలి మారాలా..? ఆయుర్వేదం ఏం చెబుతోంది..? - AP Latest News

కరోనా సమయంలో ప్రజల జీవనశైలిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కరోనా బారిన పడకుండా ఆహార పద్ధతులను, నిత్యజీవన వ్యవహారాలను మార్చుకుంటూనే.. ప్రభుత్వాల సూచనలు మేరకు మాస్క్ ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం, తరుచూ చేతులను శుభ్రం చేసుకోవడం వంటివి పాటిస్తున్నారు. ఈ సమయంలో అనాదిగా వస్తున్న ఆయుర్వేదంలో చెప్పిన పద్ధతులు పాటించడం ద్వారా.. సమస్యలు రాకుండా చేసుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం తీసుకోవడంలో ఒకే సమయం పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండేట్టుగా చేయడమే ఆయుర్వేదం చెబుతోందని విశాఖకు చెందిన పంచగవ్య నిపుణుడు, ఆయుర్వేద వైద్యుడు ఎన్వీఎస్ హరగోపాల్ చెబుతున్నారు. ఆయుర్వేద జీవన శైలి, అధునిక జీవన శైలిపై జరుగుతున్న చర్చ గురించి హరగోపాల్​తో 'ఈటీవీ భారత్' ముఖాముఖి.

హరగోపాల్
హరగోపాల్
author img

By

Published : Jun 3, 2021, 6:27 PM IST

Updated : Jun 4, 2021, 5:54 PM IST

ఈటీవీ భారత్: ఆయుర్వేద జీవన శైలి కరోనా బారిన పడకుండా ఏ రకంగా ఉండాలని చెబుతోంది?

హరగోపాల్: ఆయుర్వేదమంటేనే ఆరోగ్యకర దీర్ఘాయు జీవనం. ఇందులో సమస్య వస్తే వైద్యం అనేది ఒక ఉపాంగం మాత్రమే. ఏ రోగం రాకుండా, ఏ సమస్య రాకుండా ఏ ప్రకారం జీవిస్తే అధి సాధ్యపడుతుందో చెబుతుంది. మనిషికి కావాల్సినవి రెండు ఆరోగ్యాలు. ఒకటి మానసిక ఆరోగ్యం, రెండోది శారీరక ఆరోగ్యం. వీటికి ఆహార నియమాలు ముఖ్యమైనవి. ఎప్పుడు మేల్కొనాలి, ఎప్పుడు ఏ పని చేయాలన్నది, ఇతరులతో ఎలా వ్యవహరించాలనేవి ఇందులో ఉంటాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నియమాలు తప్పినపుడు వారి ఇంట్లో లభించే వస్తువులు, వారికి అందుబాటులో ఉండే వస్తువులతోనే నయం చేసుకోవచ్చునని ఆయుర్వేదం చెబుతోంది. 90 శాతం వ్యాధులన్నీ చిన్నపాటి వస్తువులతోనే ఎవరికివారే పరిష్కరించుకోగలుగుతారు. ఏవో కొద్దిపాటి సమస్యలు మాత్రమే అంటే ప్రమాదాల వల్ల వచ్చేవాటికే వైద్యుని సాయం అవసరమవుతుంది. మిగిలిన వాటికి అవసరం ఉండదు.

ఈటీవీ భారత్: కరోనా 85 శాతం మందికి ఏ రకమైన మందులు లేకుండా తగ్గిపోతోంది. మరో పది మందికి అసుపత్రి అవసరం వస్తోంది. ఐదు శాతం మందికి సీరియస్ అవుతోంది. ఆందులో రెండు శాతం వరకు మరణాలు సంభవిస్తున్నాయి. ఇవి గణాంకాలు చెబుతున్న వాస్తవాలు. 85 శాతం మంది సరైన జీవన విధానంలో ఉన్నారని భావించవచ్చా?

హరగోపాల్: శరీరానికి సహజంగానే ఏ వ్యాధినైనా నయం చేసుకునే శక్తి ఉంది. మానవుని పుట్టుక ఒక మాతృ, పితృ కణాలతో కలిసి ఏర్పడుతుంది. ఒక సెల్​గా ఆవిర్భవించినటువంటి మనిషి.. 120 ట్రిలియన్ సెల్స్ శరీరంగా మారిపోతోందంటే దాంట్లో ఎంత తెలివి ఉండాలి. ఆ కణాల్లో ఏయే అవయవాలు ఏ కణాలు మారాయన్నది ఎవరు నిర్ణయించారు. శరీరానికి సహజంగా ఒక శక్తి ఉంది. ఏ చిన్న అవసరం వచ్చినా సరి చేసుకునే శక్తి కూడా ఆ శరీరానికి ఉంది. మనం చేయవలసిందల్లా అది సరిచేసుకునే విధానానికి అడ్డుపడకుండా ఉంటే చాలు. ఏ వైద్యమైనా శాస్త్రపరంగా చూసినా.. ఎవరు ఏ మందులు ఇచ్చినా, ఏ విధానాన్ని అలవంభించినా శరీరం చేసే రిపేరు ప్రక్రియకు దోహదం చేయడం మాత్రమే.

ఈటీవీభారత్: కరోనా సమయంలో జీవన శైలి, ఆహార నియమాలు ఏలా ఉండాలని నిర్దేశిస్తున్నారు.

హరగోపాల్: అన్ని అవయవాలకు రోజంతా రక్త సరఫరా జరుగుతూనే ఉంటుంది. పన్నెండు ప్రధానావయవాలను తీసుకుంటే, కొన్ని నిర్దేశిత సమయాల్లో మాత్రం 80 శాతం రక్త సరఫరా ఆ అవయవాలకు చేరుతుంది. ఆసమయంలోనే ఆ అవయవం చాలా ఎగ్రసివ్​గా పని చేస్తుంది. ఉదాహరణకు ఉదయం మూడు గంటల నుంచి ఐదు వరకు శ్వాసకోశాలకు సంబందించిన సమయంగా ఉంటుంది. అంటే ఈ భాగం 80 శాతం పని అంతా ఆ సమయంలో జరుగుతుంది. ఐదునుంచి ఏడు గంటల వరకు పెద్ద పేగు యాక్టివ్​గా పని చేస్తుంది. మలినాలను బయటకు పంపే ప్రక్రియ. ఈ సమయంలో కాలకృత్యాలు తీర్చుకోవాలని చెబుతుంది. ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య జీర్ణాశయం బాగా యాక్టివ్​గా ఉంటుంది. 80 శాతం రక్తం ఈ సమయంలో జీర్ణాశయానికి చేరడం వల్ల ఎటువంటి ఆహారం తీసుకున్నా సమస్య రాదు. వందశాతం అది జీర్ణమవుతుంది. అయితే ఈ సమయంలో ఆహారం తీసుకోవడం మానేసి ఇతర సమయాల్లో తీసుకుంటున్నారు. తొమ్మిది నుంచి 11 స్పీనల్ పాంక్రియాస్, 11 నుంచి ఒంటిగంట వరకు గుండె, ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు స్మాల్ ఇంటర్స్టెయిన్.. ఇలా విభజన ఉంటుంది. ఆయా సమయాల్లో ఆ అవయవాలు పూర్తిస్థాయిలో రక్తాన్ని పొందుతున్నాయి. ఈ సమయం కాకుండా వేరే సమయంలో ఆహారం తీసుకుంటే ఆ అవయవాలకు వెళ్లాల్సిన రక్తం జీర్ణాశయానికి బలవంతంగా మళ్లించాల్సి వస్తుంది. భవిష్యత్తులో వారికి ఆ అవయ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఏర్పడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరగదు. శరీరానికి అందించాల్సిన మూలకాలను అందకుండా లోపం ఏర్పడుతుంది. వ్యాధినిరోధక శక్తి, శరీర నిర్మాణానికి కావాల్సిన శక్తి అందుతుంది. నూటికి నూరు పాళ్లు అరగాలంటే ఇవి పాటిస్తేనే సాధ్యపడుతుంది. మధ్యాహ్నం ఆకలి వేస్తే పళ్లు, ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కూరగాయల సలాడ్​లు, మొలకలు వంటి ఉడికించని వాటిని ఆహారంగా తీసుకోవచ్చు. వీటిల్లో సహజంగా ఎంజైమ్స్ ఉంటాయి కాబట్టి వీటిని అరిగించేందుకు ప్రత్యేక ఏర్పాటు అవసరం ఉండదు. సాయంత్రం వండిన ఆహారం తీసుకోవచ్చు. కానీ ఏ ఆహారమైనా సూర్యాస్తమయంలోగానే తీసుకోవాలి. సూర్యునికి మనలో జీర్ణశక్తికి సంబంధం ఉంది. చీకటిపడే కొద్దీ మన జీర్ణశక్తి తగ్గుతూ వస్తుంది. రాత్రి 9 గంటలకు నిద్రపోవాలి. 9 గంటల నుంచి తెల్లవారుజాము మూడు గంటల వరకు పూర్తిగా అవయవాలకు విశ్రాంతి ఇవ్వాలి. ఈ సమయం శరీరం రిపేర్లకు సమయం. మనం ఏ మందులు వాడినా నిజానికి అవి శరీరంలో పని చేసేది మాత్రం ఈ సమయంలోనే. అప్పటికి అవయాలన్నీ విశ్రాంతిలోకి రావాలంటే చిన్నప్రేగుకి కూడా పని ఉండకూడదు. మనం తీసుకున్న ఆహారం చిన్నప్రేగు దాటడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. తొమ్మిది గంటలకు చిన్నప్రేగు విశ్రాంతికి రావాలంటే మనం ఆరుగంటల లోపుగానే ఆహారం తీసుకోవాలి. ఇదే ప్రకృతి ధర్మంగా ఉంది. ఇలా చేసిన వారికి సర్వసాధారణంగా వ్యాధులే రావు. ఏదైనా పొరపాటు జరిగినా దానిని సరిదిద్దుకునే పని తొమ్మిది నుంచి మూడు గంటల మధ్యనే శరీరమే చేసుకుంటుంది. ఈ రకంగా ప్రకృతి నియమాలను అనుసరించి ప్రవర్తిస్తే వ్యాధుల బారిని పడడమే అరుదు.

ఈటీవీ భారత్: ఆధునిక జీవనశైలిలో ఇప్పుడు మీరు చెప్పే సమయాలు ఎంతవరకు సాధ్యపడుతాయి. దీనిని ఎలా అధిగమించాలి.

హరగోపాల్: ఎన్నిరకాల అలవాట్లు ఉన్నప్పటికి అవన్నీ ఆరోగ్యంగా బతికి బాగున్నప్పడే సాధ్యమవుతుంది. డబ్బు ఉంటే సరిపోదు.. ఆరోగ్యం ఉండాలి. ఆధునిక జీవన శైలి అంతా డబ్బు చుట్టూనే తిరుగుతోంది. మనం చెబుతున్నది ఆరోగ్యం, ఆనందం చుట్టూ తిరిగే పద్ధతి. ఈ రెండూ ప్రధాన అంశాలుగా తీసుకున్నట్టయితే ఈ సర్దుబాటు సాధ్యపడుతుంది. జీవనశైలిలో మార్పులు పెద్ద కష్టం కాదు. నిజానికి పొద్దున భోజనం చాలా సులువైన పని. ఆ తర్వాత వారికి దాదాపుగా వంటకు సంబంధించిన పనే ఉండదు. రోజంతా తమ వ్యాపకంలో ఉండొచ్చు. మధ్యాహ్నం భోజనం చేస్తేనే రోజంతా వంట పని ఉన్నట్టు ఉంటుంది. సూర్యోదయానికి ముందే లేచి, రాత్రి వేగంగా పడుకోమని చెబుతున్నాం. రాత్రి తొమ్మిది నుంచి మూడు గంటల వరకు నిద్రలో ఉండమని చెబుతున్నాం. ఈ సమయంలో గాల్ బ్లేడర్, ట్రిపుల్ వార్మర్, లివర్ చాలా ఎగ్రసివ్​గా పని చేస్తాయి. మొత్తం శరీరం రిపేర్ పని అంతా ఆ సమయంలోనే జరుగుతుంది. రిపేర్ కోసం ఇచ్చిన విశ్రాంతి తప్ప మరేమీ కాదన్నది గుర్తుపెట్టుకోవాలి. తెల్లవారు జాము మూడు గంటలనుంచి చాలా ఉత్సాహంగా, చురుగ్గా రోజంతా ఉంటారు. ఎటువంటి మత్తు, బాధ ఉండదు. ఆధునిక జీవన శైలికి నిజానికి బాగా సరిపోయే పద్ధతి ఇదే.

ఈటీవీభారత్: ఆహార నియమాల ద్వారా, వంటింటి వస్తువుల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

హరగోపాల్: శరీరాలను, వచ్చే వ్యాధులను వాత, పిత్త, కఫాలుగా మూడు రకాలుగా వర్గీకరిస్తారు. కరోనా వైరస్ కోల్డ్ వైరస్. కఫ వ్యాధికి సంబంధించినది. ఆహారంలో తీపి, పులుపు, ఉప్పు ఈ వ్యాధిని పెంచగలిగేవి. ఈ వ్యాధిని దగ్గరకు రాకుండా చేసేవి కారం, చేదు, వగరు. ఇవి ఆహారంలో ఎక్కువ తీసుకుంటే సహజంగానే కరోనా పట్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కరోనాకు భయపడాల్సిన పని లేదు. ప్రధానంగా గానుగ నూనెలు వాడుక మేలు చేసేది. కరివేపాకు వాడితే మైక్రోన్యూట్రెట్లు ఎక్కువగా అందుతాయి. కరివేపాకు పొడి, ధనియాలపొడి వాడకం నిత్యం అహారంలో చేర్చడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతాం.

ఈటీవీ భారత్: ఆహారం, నీరు తీసుకునేటప్పుడు అనుసరించాల్సిన పద్ధతులు ఏమిటి?

హరగోపాల్: ఆహారం ఎప్పుడూ వేడిగా తీసుకోవాలి. బాగా నమిలి పూర్తిగా నోటిలోనే ద్రవ రూపంగా మారేట్టుగా లాలాజలంతో కలిపి మింగడం వల్ల అది పూర్తిగా జీర్ణమవుతుంది. మీరు తీసుకునే అహారంలో అన్ని పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయి. రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. ఎప్పుడు తాగినా వేడి నీరు తీసుకోవడం.. అది కూడా పూర్తిగా లాలాజలంతో పుక్కిలించి తీసుకోవడం వల్ల ఎటువంటి జీర్ణసంబంధ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడొచ్చు. నీరు తాగేటప్పుడు ఎప్పుడూ కూర్చోని మాత్రమే తీసుకోవాలి. లాలాజలం మనకు అంతర్గత శరీర నిర్మాణంలో వచ్చే అత్యద్భుత సంజీవిని. మామూలుగా మింగేస్తే జీర్ణాశయంలోకి వెళ్లకుండానే అవిరి ఆయిపోతుంది. అలా కాకుండా నీళ్లు తాగేటప్పుడు ప్రతి గుక్కలోనూ పుక్కిలించి లోనికి తీసుకుంటే కలిగే ప్రయోజనం అనంతం. తినేటప్పుడు కూడా ప్రతి ముద్ద పూర్తిగా నమిలి దాని రుచిని ఆస్వాదిస్తూ, లాలాజలంలో కలిపి కడుపులోకి చేరిస్తే చాలా వరకు సమస్యలు దరి చేరవు. ఆహారం తీసుకోవడానికి అరగంట ముందు, తీసుకున్న ఒకటిన్నర గంట తర్వాత నీరు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

ఈటీవీ భారత్: ఆధునిక శైలిలో కొందరు వైద్యులు ఆవిరి పట్టడం ప్రమాదం అని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆవిరి తీసుకోవాలని సూచిస్తున్నాయి. ఏది జనం సాటించాలి?

హరగోపాల్: రెండు వాదనలు సరైనవే. ఇందులో షరతులు వర్తిస్తాయన్నది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఏమి చేయాలన్న దగ్గరే సందేహం. రెండింటిని జనరలైజ్ చేయడం మాత్రం పొరబాటు. కరోనాలో ఇప్పటికే 11, పన్నెండు రకాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. వాటి లక్షణాలను అనుసరించి దాని బారిన పడ్డవారిని చూడాల్సి ఉంటుంది. కొంతమందిలో రుచి, వాసన పోతున్నాయి. గొంతులో కఫం పట్టిన వారు ఆవిరి పట్టుకోవాలి. ఆవిరిలో కొద్దిగా పసుపు, వాము, నీలగిరి తైలం రెండు చుక్కలు వేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. కొంతమంది చెబుతున్నట్టుగా ఆవిరితో పాటు ప్రయాణం చేసి ఊపిరితిత్తులకు వైరస్ చేరుతుందని ప్రచారం చేస్తున్నారు. అది నిజం కాదు. ఆవిరి వేడితో వచ్చే వైరస్ ఇన్​యాక్టివ్ అవుతుంది. వేడి నీటి ఆవిరి ఎప్పుడూ వైరస్​కి వాహకం కాదు. మంచిది కదా అని ప్రతి వారూ ఆవిరి పడుతూ కూర్చోకూడదు. కరోనా సమస్య లేని వారు ఆవిరి పట్టాల్సిన అవసరం లేదు. ఇది పొరపాటు. వేడినీటి అవిరి వల్ల ముక్కులో ఉన్న కొటానుకోట్ల కణాలతో తయారైన సున్నిత భాగాలు దెబ్బతినే అవకాశం ఏర్పడుతుంది. కొంతమంది అదేపనిగా ఆవిరి పీల్చడం వల్ల ముక్కలోని, శ్వాస కోశాల్లోనూ సున్నితపొర దెబ్బతుంటుంది. దీనివల్ల సూక్ష్మక్రీమి బయటనుంచి ప్రవేశించేసమయంలో పసిగట్టి అడ్డుకునే వ్యవస్థలన్నీ పని చేయకుండా పొతాయి.

ఈటీవీ భారత్: కరోనాతో హోం ఐసోలేషన్​లో ఉంటున్నవారికి మీ సలహా, సూచనలు ఏమిటి?

హరగోపాల్: ఐసోలేషన్​లో ఉన్న వ్యక్తికి తాను ఒంటరిని అన్న భావన ఉండకూడదు. అందరితో కలిసి ఉన్నానన్న భావన మనిషిలో రోగ నిరోధక శక్తి పెంచుతుంది. సంతోషం, ధైర్యం ఎక్కువగా పని చేస్తుంది. ఆధైర్యాన్ని ఇవ్వడమే ఇక్కడ ప్రధానం. అంతర్ముఖ ప్రాణాయామ సాధన చేసే వారికి ఈసమస్య వచ్చే అవకాశం లేదు. భస్త్రిక, కపాలభాతి వంటి శ్వాసాయామాలు చేసే వారి ఊపిరితిత్తుల సామర్ధ్యం బాగా పెంచడానికి ఉపకరిస్తుంది. ముద్రలు ఇందుకు దోహదపడతాయి. లింగ, వాయు, సమాన ముద్రలు ఊపిరితిత్తులను క్లియర్ చేయగల శక్తి ఉన్నవి. ఈ ముద్రలలో ఐదు నుంచి 40నిమిషాలు పాటు ఉంటే ఆక్సిజన్ బాగా పెరిగేందుకు దోహదమవుతుంది. ముక్కునుంచి శ్వాసకోశాలు వరకు ఉన్న అన్ని అవయవాలు క్లియర్ అవుతాయి. ఇది ప్రతి ఒక్కరూ చేయవచ్చు. టెస్ట్ చేసి చూసుకోవచ్చు.

ఈటీవీ భారత్: రోగ నిరోధక శక్తి ఇంకా పెంచుకునేందుకు మీరు చెప్పే మరిన్ని మార్గాలు ఏమిటి?

హరగోపాల్: ఆయుర్వేదం బయోటిక్ థియరీ. శరీరం ఒక జీవపదార్థంతో రూపుదిద్దుకుని నడుస్తోంది. ఇవ్వాల్సిన ఆహారం, మందులు అన్నీ బయోటిక్ అయి ఉండాలన్నదే ఆయుర్వేద సిద్ధాంతం. శరీరంలో ఒక మైక్రోబియల్ ఎన్విరాన్​మెంట్ ఉంటుంది. ఆయుర్వేదంలో ఇదే క్రిమీ... కీటకాది రిష్టం అంటూ... చెప్పారు. నిజానికి ఇది ప్రమాదకరం కాదు. ఇవన్నీ కలిపి సహజీవనం చేస్తుంటాయి. ఎప్పుడు ఒకదానిని ఒకటి నియంత్రిస్తూ వస్తాయి. అలా ఉన్నంతవరకు శరీరంలో అన్ని క్రియలూ సక్రమంగానే జరుగుతుంటాయి. ఇందులో ఏదో ఒకటి ఎక్కువ తక్కువ అయితేనే సమస్య. ఒకటి ఎక్కువైనపుడు దానిని నియంత్రించేదానిని పెంచుకుంటే సమస్య పరిష్కారమైపోతుంది. దీనినే ఇప్పుడు పాశ్చాత్య వైద్య శాస్త్రం ప్రోబయోటిక్స్ అంటోంది. మైక్రోబియల్ ఎన్విరాన్​మెంట్ కాపాడేందుకు శరీరానికి కావాల్సిన పదార్థాలన్నీ అందించడం, నిత్యం తీసుకునే ద్రవ్యాలలో పంచగవ్యాలు చేరిస్తే చాలా వరకు ఈ సమస్య ఉత్పన్నం కాదు. అవు పాలు కాచి తొడు వేసి పెరుగు చిలికి వెన్నతీసిన మజ్జిగ ఉదయం నుంచి మధ్యాహ్నం లోపుగా తీసుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంది. తర్వాత తీసుకుంటే వికటించే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండీ... Anandaiah Medicine: 3 నెల‌ల త‌ర్వాతే.. ఆనంద‌య్య చుక్క‌ల‌మందు..!

Last Updated : Jun 4, 2021, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.