తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ విద్యాభూషణ్(East Coast Railway GM Vidyabhushan).. వాల్తేర్ డివిజన్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా విశాఖ రైల్వేస్టేషన్ ను సందర్శించారు. జీఎం పర్యటన దృష్ట్యా విశాఖ రైల్వేస్టేషన్‌లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్ 4,5 లలో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ఎస్కలేటర్లను జీఎం విద్యాభూషణ్ ప్రారంభించారు. అలాగే ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్‌మెంట్ హెడ్ ఎక్విప్‌మెంట్ విభాగాన్ని తనిఖీ చేశారు. విశాఖపట్నంలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కార్యాలయం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ పర్యటనలో వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ అనుప్ కుమార్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి