ETV Bharat / city

'ఏయూ ఐపీఆర్‌ చైర్'​​గా డాక్టర్‌ హనుమంతు పురుషోత్తం - ఆంధ్ర విశ్వవిద్యాలయం

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఇంటలెక్చ్యువల్‌ ప్రోపర్టీ రైట్స్‌(ఐ.పి.ఆర్‌) చైర్‌ను మంజూరు చేసింది. ఈ ఐ.పి.ఆర్‌.చైర్‌ రాష్ట్రంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికే మంజూరు చేయడం పట్ల వీసీ అభినందించారు.

Dr. Hanumanthu Purushottam is the Chairperson of AU IPR
ఏయూ ఐ.పి.ఆర్‌.చైర్‌గా డాక్టర్‌ హనుమంతు పురుషోత్తం
author img

By

Published : Dec 6, 2020, 10:50 AM IST

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఇంటలెక్చ్యువల్‌ ప్రోపర్టీ రైట్స్‌(ఐపీఆర్‌) చైర్‌ను మంజూరు చేసింది. ఈ స్థానంలో కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పరిధిలో నేషనల్‌ రీసెర్చ్​ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్​ఆర్​‌డీసీ) చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ హనుమంతు పురుషోత్తంను ఐపీఆర్​ చైర్‌గా నియమిస్తూ ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ.ప్రసాదరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన శనివారం తన విధుల్లో చేరారు. ఈ ఐపీఆర్​ చైర్‌ రాష్ట్రంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికే మంజూరు చేయడం పట్ల వీసీ అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌, ఈసీ సభ్యులు డాక్టర్‌ జేమ్స్‌ స్టీఫెన్‌, డీన్‌ ఆర్​అండ్​‌డీ ఆచార్య ఏ.భుజంగరావు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆస్పత్రులకు శ్రేణులు కేటాయించిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.