ETV Bharat / city

Capital issue: ఏపీ రాజధానిపై నౌకాదళం దుమారం.. సంచలనం రేపుతున్న ప్రకటన! - నేవీ ఏపీ రాజధాని వివాదం

రాజధాని విషయంలో నౌకాదళ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఓ యుద్ధనౌకకు ఏపీ పాలనా రాజధాని విశాఖపట్నం పేరు పెట్టామంటూ విడుదల చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఈ విషయమై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

navy announcement on  executive capital
navy announcement on executive capital
author img

By

Published : Nov 6, 2021, 2:51 PM IST

రాష్ట్ర రాజధాని అంశం హైకోర్టు విచారణలో ఉన్న సమయంలో.. నౌకాదళ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. భారత నౌకాదళానికి చెందిన ఓ యుద్ధనౌకకు.. "ఏపీ పాలనా రాజధాని విశాఖపట్నం పేరు పెట్టాం" అంటూ.. జారీచేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశమైంది.

ముంబై డాక్ యార్డ్‌లో నిర్మాణమవుతున్న "15బి గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్" యుద్ధ నౌకకు ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్నం పేరు పెట్టామంటూ తూర్పు నౌకాదళ కమాండ్ నుంచి అధికారికంగా పత్రికా ప్రకటన జారీ అయ్యింది.

తూర్పునౌకాదళ కమాండ్ ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ నిన్న సీఎం జగన్‌ను కలిసి.. డిసెంబరు 4వ తేదీన జరిగే నౌకాదళ దినోత్సవానికి హాజరు కావాలంటూ ఆహ్వానపత్రిక అందించారు. ఈ సందర్భంగా ముంబైలో నిర్మితమవుతున్న యుద్ధ నౌక 15బి స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్‌కు ఏపీ పాలనా రాజధాని విశాఖపట్నం పేరు పెట్టామని.. వైస్ అడ్మిరల్ అజేంద్ర సింగ్ సీఎంకు వివరించినట్టుగా నౌకాదళం ప్రకటనలో వెల్లడించింది.

రాజధాని అంశం హైకోర్టు విచారణలో ఉండటంతోపాటు.. కేంద్ర హోంశాఖ నిర్ధరించకుండా ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖపట్నం అని నౌకాదళం తన ప్రకటనలో పేర్కొనటం చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి:

CM Jagan tweet on praja sankalpa yatra: 'ప్రజల కోసమే.. ప్రజా సంకల్ప యాత్ర'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.