ETV Bharat / city

Visakha AU : ఆంధ్ర వర్సిటీ రంగస్థలానికి.. అ"పూర్వ" వైభవం తెచ్చేలా..

author img

By

Published : Oct 27, 2021, 6:32 PM IST

అక్కడ నాటక కళ ఒకనాడు అంతులేని కీర్తిని సంపాదించింది. ఎందరో సినీ ప్రముఖులు ఆ కళావేదికపై తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ రంగస్థలంపై ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఈ ప్రదర్శనలను తిలకించేందుకు వచ్చేవారు. అలాంటి రంగస్థలం కాలం గడుస్తున్న కొద్దీ మరుగున పడి చివరికి శిథిలావస్థకు చేరింది. ఆ రంగస్థలానికి గత వైభవం తెచ్చేలా ఆంధ్ర వర్సిటీ అధికారులు నడుం బిగించారు.

Visakha AU
శిథిలావస్థలో రంగస్థలం...దాతల సాయంతో పునర్నిర్మాణం...

ఒకనాడు నాటక కళ అంతులేని కీర్తిని సంపాదించింది. ఎందరో సినీ ప్రముఖులు ఆ కళావేదికపై తమ ప్రతిభను చాటుకున్నారు. అలాంటి రంగస్థలం కాలం గడుస్తున్న కొద్దీ మరుగున పడి చివరికి శిథిలావస్థకు చేరింది. ఆ రంగస్థలానికి పూర్వ వైభవం తెచ్చేలా.. ఆంధ్ర వర్సిటీ అధికారులు నడుం బిగించారు. అరవై సంవత్సరాల చరిత్ర కలిగిన కళావేదికకు కొత్త సొబగులు అద్దుతున్నారు.

ఆంధ్ర వర్సిటీ రంగస్థలానికి.. అ"పూర్వ" వైభవం తెచ్చేలా..

విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఆరుబయలు రంగస్థలం ఇది. ప్రఖ్యాత నాటకరంగ ప్రేమికుడు, ప్రోత్సాహకుడైన నాటి రిజిస్ట్రార్ కె.వి గోపాలస్వామి ఆలోచనలతో 1957లో రూపుదిద్దుకుంది. పృథ్వి థియేటర్స్ నిర్వాహకుడు శశికపూర్ అప్పట్లో ఈ రంగస్థలంపై ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఈ ప్రదర్శనలను తిలకించేందుకు వచ్చేవారు. చాట్ల శ్రీరాములు, అబ్బూరి గోపాలకృష్ణ, కనకాల సాక్షి రంగారావు, వంకాయల సత్యనారాయణ, మిస్రో వంటి నాటక, సినీ రంగ ప్రముఖులు ఈ వేదిక పైనుంచే గొప్ప కళాకారులుగా ఎదిగారు. అలాంటి రంగస్థలం కాలగమనంలో శిథిలావస్థకు చేరింది. హుద్‌హుద్‌ తుపానుతో మరింత పాడైంది. దీనికి పూర్వ వైభవం కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఏపీఈడబ్యూఐడీసీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చెందిన రాష్ట్రీయ ఉచ్ఛత్ శిక్ష అభియాన్ సమకూర్చిన 70 లక్షల రూపాయల నిధులతో పునర్‌ నిర్మాణం చేపట్టారు.

కళావేదికను 24 అడుగుల ఎత్తులో రెండంతస్తుల బ్యాక్ స్టేజ్‌తో సిద్ధం చేశారు. కళాకారుల ముఖాలంకరణకు(మేకప్) ఉపయోగపడేలా 'గ్రీన్ రూమ్'లు నిర్మించారు. రంగస్థలంపై వర్షం, గాలివాన, నీలి ఆకాశం, సముద్రతీరం వంటి సన్నివేశాలను ప్రదర్శించేందుకు వీలుగా 'సైక్లోరమా' వ్యవస్థను తీర్చిదిద్దారు. రంగస్థలం చారిత్రక, కళా ప్రాశస్త్యం దెబ్బతినకుండా పునరుద్ధరణ సాగుతుందని వర్సిటీ అధికారులు తెలిపారు. రానున్న విద్యా సంవత్సరం నాటికి సర్వహంగులతో సిద్ధం చేస్తామని చెప్పారు. ప్రేక్షకులు కూర్చునే నిర్మాణాలను కళారంగ ప్రేమికులు, దాతల ఆర్థిక సహకారంతో నిర్మించనున్నట్లు తెలిపారు.

"కొంతమంది ఫిలాంత్రఫిస్టులు..యూనివర్సిటీ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న వారు ముందుకు వచ్చి కొత్త సీట్లను ఏర్పాటుకు ఖర్చు భరిస్తామని చెప్పారు. అందుకు తగిన ప్రతిపాదన సిద్ధం చేశాం. త్వరలో పూర్తిగా కొత్త నిర్మాణాలు చేపడతాం. అవసరమైన నిధులకు మా కార్యనిర్వాహక మండలి కూడా ఆమోదం తెలిపింది. అన్ని రకాలుగా అభివృద్ధి చేపడతాం." -కృష్ణమోహన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌

ఆంధ్ర వర్సిటీ శతాబ్ది ఉత్సవాల కోసం సమాయత్తమవుతున్న వేళ.. రంగస్థలానికి అత్యాధునిక హంగులు అద్దడంపై కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి : AP GENCO : జెన్‌కో యూనిట్లను బలపరచండి: విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.