ETV Bharat / city

ఐఎన్​ఎస్ సర్కార్స్ స్టేషన్ కమాండర్​గా.. ధడ్వాల్ బాధ్యతలు

విశాఖ తూర్పు నౌకాదళంలోని ఐఎన్​ఎస్ సర్కార్స్ స్టేషన్ కమాండర్​గా ఎ.ఎస్. ధడ్వాల్ బాధ్యతలు చేపట్టారు. ఫ్లాగ్ ఆఫీసర్ సీ ట్రయినింగ్​గా కొచ్చికి బదిలీ అయిన కమాండర్ రాహుల్ విలాస్ గోఖలే నుంచి ధడ్వాల్ బాధ్యతలు తీసుకున్నారు.

ఐఎన్​ఎస్ సర్కార్స్ స్టేషన్ కమాండర్​గా ధడ్వాల్ బాధ్యతలు

author img

By

Published : Apr 21, 2022, 9:54 PM IST

విశాఖ తూర్పు నౌకాదళంలోని ఐఎన్​ఎస్ సర్కార్స్ స్టేషన్ కమాండర్​గా ఎ.ఎస్. ధడ్వాల్ బాధ్యతలు చేపట్టారు. కమాండర్ రాహుల్ విలాస్ గోఖలే నుంచి ధడ్వాల్ బాధ్యతలు తీసుకున్నారు. ఫ్లాగ్ ఆఫీసర్ సీ ట్రయినింగ్​గా కొచ్చికి రాహుల్ విలాస్ గోఖలే బదిలీ అయ్యారు. అంతకుముందు ఐఎన్​ఎస్ సర్కార్స్ పరేడ్ మైదానంలో నావికుల నుంచి ధడ్వాల్ గౌరవ వందనం స్వీకరించారు. ఆయన 1993లో భారత నౌకాదళంలో చేరారు. ఐఎన్​ఎస్ గోమతి, శివాలిక్​లకు సారథ్యం వహించారు. అమెరికాలో పలు అంశాలలో శిక్షణ పొందారు. ఈ ఏడాది ధడ్వాల్​కు విశిష్ట సేవా మెడల్ పురస్కారం లభించింది. తూర్పు నౌకాదళంలో ఐఎన్​ఎస్ సర్కార్స్ అత్యంత కీలక విభాగం. దాదాపు 43 అదనపు యూనిట్లకు.. 2,500 మంది నావికులు, 450 అధికారులతో ఈ విభాగం ఏర్పాటైంది.

ఐఎన్​ఎస్ సర్కార్స్ స్టేషన్ కమాండర్​గా ధడ్వాల్ బాధ్యతలు
ఐఎన్​ఎస్ సర్కార్స్ స్టేషన్ కమాండర్​గా ధడ్వాల్ బాధ్యతలు

ఇదీ చదవండి: గుజరాత్​లో బ్రిటన్​ ప్రధాని.. 'బుల్​డోజర్'​ ఫ్యాక్టరీలో సందడి సందడిగా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.