విషవాయు లీకేజీ వ్యవహారంలో నిందితులు ఎంతటివారైనా వదిలేది లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. విశాఖ కేజీహెచ్‌ను సందర్శించిన ఆయన... ప్రస్తుతం వివిధ మార్గాల్లో విచారణ సాగుతోందని వెల్లడించారు. క్షతగాత్రుల్లో చాలామంది ఇప్పటికే కోలుకున్నారని... పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు.
గ్యాస్ లీక్ తర్వాత పోలీసులు వెంటనే సహాయ చర్యలు చేపట్టి చాలా మంది ప్రాణాలను రక్షించారని డీజీపీ అన్నారు. సహాయచర్యల్లో పాల్గొన్న పోలీసులకు పురస్కారాలు అందిస్తామన్నారు. ప్రస్తుతం పరిశ్రమ వద్ద పరిస్థితి నియంత్రణలోనే ఉందని స్పష్టం చేశారు. సాంకేతిక నిపుణులు విషవాయువు ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాలను సాధారణ స్థితికి తేవడమే తమ ప్రథమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి