ETV Bharat / city

సంపత్​ వినాయకుని ఆలయానికి భక్తుల తాకిడి

అశీల్​మెట్ట సంపత్​ వినాయక దేవాలయానికి శనివారం భక్తులు దర్శించుకునేందుకు భారీగా వచ్చారు. కొవిడ్​ నిబంధనలు ఉన్నప్పటికి వినాయక చవితి రోజు కావడం వల్ల భక్తుల రాక తగ్గలేదు. ఆలయ అధికారులు జాగ్రత్తలు పాటించి వారికి స్వామి వారి దర్శనాన్ని కల్పించారు.

devotees rush to sampath vinayaka temple in visakhapatnam
అశీల్​మెట్ట సంపత్​ వినాయక దేవాలయం
author img

By

Published : Aug 22, 2020, 4:10 PM IST

వినాయక చవితి సందర్భంగా విశాఖ అశీల్​మెట్ట సంపత్​ వినాయక దేవాలయం వద్ద తెల్లవారుఝాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. ఆలయానికి వచ్చే భక్తులకు ఉష్ణోగ్రత, స్క్రీనింగ్​, శానిటేషన్​ వంటి జాగ్రత్తలు తీసుకుని.. బాగానే ఉన్నారని నిర్థారించుకున్నాకే దర్శనానికి అనుమతించారు. ప్రతి ఏటా ఇక్కడ వినాయక చవితి నవరాత్రి వేడుకలు భారీగా జరుగుతాయి. కానీ.. కరోనా వైరస్​ దృష్ట్యా ఈ సారి అధికారులు ఉత్సవ నిర్వహణకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు.

ఇదీ చదవండి:

అయినవిల్లి సిద్ధి వినాయకుని దర్శనం పునః ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.