స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై సుప్రీం కోర్టుకు వెళ్లే సమయం ప్రభుత్వానికి లేదని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. దీనిపై మంత్రి వర్గ సమావేశంలో తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విశాఖలోనే ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని ఆయన స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు పోగొట్టిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. విశాఖ జిల్లా మధురవాడ రిజిస్ట్రార్ కార్యాలయంపై గతంలో వచ్చిన ఆరోపణల దృష్ట్యా డిప్యూటీ సీఎం.. ఆకస్మిక తనిఖీ చేశారు.
ఇదీ చదవండి: బీసీ వర్గాలపై కక్షతోనే ఇలా చేశారు - చంద్రబాబు