విశాఖలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువతతో ముఖాముఖి నిర్వహించారు. తెదేపాలో అందరూ చదువుకున్న వారు ఉన్నారని చెప్పారు. ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అని అనుకోవద్దన్న లోకేశ్... ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటు ముఖ్యమేనని వివరించారు.
రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితి కనిపిస్తోంది. ఉన్న పరిశ్రమలను రాష్ట్రం నుంచి పంపేస్తున్నారు. కియా, లూలూ, అదానీ వంటి సంస్థల్ని మేం తెచ్చాం. లూలూ సంస్థ వచ్చి ఉంటే రూ.2 వేల కోట్ల పెట్టుబడి వచ్చేది. అదానీ సంస్థ వచ్చి ఉంటే లక్ష ఉద్యోగాలు వచ్చేవి. పరిస్థితి గాడి తప్పితే దారిలోకి రావడం చాలా కష్టం.-నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇదీ చదవండీ... ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాలో విశాఖకు 15వ స్థానం