రాష్ట్ర విపత్తు నిర్వహణ రికవరీ ప్రాజెక్టు కింద 4 తీర ప్రాంత జిల్లాల్లో 1,777 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేయాల్సిందిగా సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలకు సూచించారు. ఏపీడీఆర్పీ కింద చేపట్టిన పనుల్ని ఈ నెలాఖరుకే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ... కొవిడ్ కారణంగా ఆలస్యమైనట్టు అధికారులు సీఎస్‌కు వివరించారు.
మార్చి 10వ తేదీ నాటికి ఏపీడీఆర్పీ ప్రాజెక్టు పనుల్లో 1,382 కోట్ల మేర పనుల్ని పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా... విశాఖ నగరంలో ఏపీఈపీడీసీఎల్ భూగర్భ విద్యుత్ లైన్ల నిర్మాణంలో 50 శాతం మేర పనులు పూర్తైనట్టు సీఎస్ స్పష్టం చేశారు. ఇక గ్రామీణ ప్రాంతాల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా... 4 జిల్లాల్లో 291 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 528 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపట్టాల్సి ఉందని తెలిపారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 178 కోట్లతో బీచ్ షోర్ డెవలప్మెంట్ పనుల్ని మార్చిలోగా పూర్తి చేయాలన్నారు.
ఇదీ చదవండి:
'యువ శక్తికి, దేశ భక్తికి నిర్వచనంగా మారిన ధన్య జీవులు వారు'