ETV Bharat / city

Credai property show: నేటి నుంచి.. క్రెడాయ్‌ స్థిరాస్తి ప్రదర్శన - ap news

‘స్థిరాస్తి’కి చెందిన సంస్థలను ఒకే చోటకు చేర్చి... ఇళ్ల స్థలాలు, ఇళ్లు, విల్లాలు వంటివి కొనుగోలు చేయాలనుకునే వారికి మరింత సౌలభ్యంగా ఉండేందుకు వీలుగా ‘క్రెడాయ్‌ స్థిరాస్తి ప్రదర్శన’ నేటి నుంచి విశాఖలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆరు షోలను విజయవంతంగా నిర్వహించి.. ఎందరో సొంతింటి కలను నిజం చేసిన ఈ సంస్థ..... మరోసారి ప్రాపర్టీ షోకి సర్వం సిద్ధం చేసింది. ప్రజలంతా ఈ షోను సందర్శించి తమ ఇంటి కలను సాకారం చేసుకోవాలని ప్రతినిధులు కోరుతున్నారు..

Credai property show
Credai property show
author img

By

Published : Dec 24, 2021, 9:27 AM IST

నేటి నుంచి.. క్రెడాయ్‌ స్థిరాస్తి ప్రదర్శన

సిటీ ఆఫ్ డెస్టినీ-విశాఖ. ప్రకృతి అందాలు, ప్రశాంతత కలగలిపిన విశాఖలో సొంతిల్లు ఉండాలనేది చాలా మంది కోరిక. ఆరేళ్లుగా ప్రాపర్టీ షోలను విజయవంతంగా నిర్వహిస్తూ క్రెడాయ్‌ వారి కలలను నిజం చేస్తోంది. ప్రతి ఏడాదిలానే ఈసారీ మరో ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. నేడు, రేపు, ఎల్లుండి... 3 రోజుల పాటు ఎంపీవీ కాలనీలోని గాదిరాజు ప్యాలెస్‌లో ఈ ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రదర్శనను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించనున్నారు. శని, ఆదివారాల్లో కొనసాగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. ఒకే చోట పదుల సంఖ్యలో ప్రముఖ స్థిరాస్తి సంస్థల స్టాళ్లు ఏర్పాటు చేశారు. అవసరమైనవారికి వెంటనే రుణం అందించేలా ఎస్​బీఐ సైతం ఈ ప్రదర్శనలో పాలు పంచుకుంటోంది.

ప్రాపర్టీ షోకు వచ్చేవారి కోసం..లక్కీ డ్రా ద్వారా ప్రతి గంటకూ ఓ బంగారు నాణెం బహుమతిగా ఇచ్చేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేశారు. బంపర్ ప్రైజ్‌గా ఎలక్ట్రానిక్ బైక్‌నూ అందిస్తున్నారు. ప్రాపర్టీ షోను అంతా సద్వినియోగం చేసుకోవాలని క్రెడాయ్ ప్రతినిధులు కోరారు.

'ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలి. శనివారం స్మార్ట్‌ సిటీ అభివృద్ధి, ఎస్‌బీఐ ప్రతినిధులతో చర్చావేదిక ఉంటుంది. వచ్చే సందర్శకుల్లో లక్కీ డ్రా విజేతలకు ఆకర్షణీయ హుమతులు ఇస్తాం.' -స్థిరాస్తి ప్రదర్శన కన్వీనర్‌ వి.శ్రీనివాస్‌

ఇదీ చదవండి:

Ramineni Foundation Awards : 'తెలుగోడి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.