ETV Bharat / city

'రాజ్యాంగానికి విరుద్ధంగా భాజపా వ్యవహరిస్తోంది' - cpi ramakrishna latest news

భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా భాజాపా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విశాఖలో జరిగిన సీపీఐ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. సీఏఏ సవరణ బిల్లు పట్ల భాజపా ప్రభుత్వం వైఖరిని ఆయన తప్పుబట్టారు.

cpi ramakrishna speaks on central govt
సీపీఐ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
author img

By

Published : Feb 27, 2020, 7:56 PM IST

సీపీఐ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ప్రాంతాలకు, మతాలకు అతీతంగా దేశ పౌరసత్వం ఉండాలంటూ రాజ్యాంగం చెబుతున్నా... భాజపా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విశాఖ నీలం రాజశేఖర్​రెడ్డి భవన్​లో నిర్వహించిన సీపీఐ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. దేశ ప్రజల సమస్యలు, ఆకాంక్షలను వదిలిపెట్టి కేంద్రంలో భాజపా ప్రభుత్వం మతతత్వ అజెండాను అమలు చేస్తోందని పేర్కొన్నారు. పౌరసత్వ చట్ట సవరణ చేయడం పట్ల అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​, ఐరోపా యూనియన్​ సభ్య దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. సీఏఏ సవరణ బిల్లును లోక్​సభలో ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రంలో ఉన్న వైకాపా, తెదేపా ఎంపీలు మద్దతు తెలిపారని, ఒక్క ఎంపీ కేశినాని నాని గైర్హాజరయ్యారని రామకృష్ణ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :

'చిల్లర రాజకీయాలు మానండి... విభజన హామీలపై దృష్టి పెట్టండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.