ETV Bharat / city

విశాఖ కేంద్రంగా రెండు కొవిడ్ వ్యాక్సిన్ల క్లినికల్​ ట్రయల్స్​

author img

By

Published : Aug 21, 2020, 1:19 PM IST

విశాఖ ఆంధ్ర వైద్య కళాశాలకు రెండు కరోనా వ్యాక్సిన్ల క్లినికల్ పరీక్షలు నిర్వహించే అవకాశం లభించింది. ఈ మేరకు ఆసుపత్రి యాజమాన్యం వివరాలు తెలియజేసింది.

covid vaccine clinical trails to vizag andhra medical college
విశాఖ ఆంధ్ర వైద్య కళాశాలకు అరుదైన అవకాశం

విశాఖ ఆంధ్ర వైద్య కళాశాలకు రెండు కరోనా వ్యాక్సిన్ల క్లినికల్ పరీక్షలు నిర్వహించే అవకాశం లభించింది. అందులో ఒకటి సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కొవిడ్ వ్యాక్సిన్ రెండు, మూడు దశల పరీక్షలు.. మరొకటి మధ్యస్థ రకం నుంచి, తీవ్రమైన లక్షణాలు ఉన్నవారికి ఇచ్చే డ్రగ్ క్లినికల్ ట్రయల్స్.

వీటి కోసం ఆంధ్ర వైద్య కళాశాల, కింగ్ జార్జ్ ఆసుపత్రిని ఆయా సంస్థలు ఎంపిక చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించి పరీక్షల నిర్వహణకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ట్రయల్స్​ను ఆంధ్ర వైద్య కళాశాల ఆచార్యులు నిర్వహిస్తారు. వీటికి ప్రధాన ఇన్వెస్టిగేటర్లుగా సీనియర్ ప్రొఫెసర్లకు బాధ్యతలు అప్పగించినట్లు ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ తెలిపారు.

  • 'అక్యూట్ ట్రీట్​మెంట్ ఆఫ్ మోడరేట్ టూ సివియర్ కొవిడ్ 19' మందు రెండో దశ ట్రయల్స్ డీఆర్​డీఓఈ సహకారంతో చేయనున్నారు. ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ డాక్టర్ వై. జ్ఞానసుందర్ రాజు నేతృత్వంలో ట్రయల్స్ జరుగుతాయి.
  • సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కొవిడ్ వ్యాక్సిన్ రెండు, మూడు సింగిల్ బ్లెండ్ రాండమైజ్​డ్ కంట్రోల్ స్టడీ జరుగుతుంది. దీనికి ప్రొఫెసర్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ మాధవి దేవి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్​గా వ్యవహరిస్తారు. దీనికి ఐసీఎంఆర్ సహకారం అందిస్తుంది.

ఈ కీలక అధ్యయనాలు నిర్వహించే అవకాశం వచ్చినందుకు జిల్లా కలెక్టర్ కళాశాల వైద్య నిపుణులకు అభినందనలు తెలియజేశారు.

ఇవీ చదవండి...

నగదు చోరీ దుండగుల చిత్రాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.