భవన నిర్మాణ కార్మికులు పొందుతున్న సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడం దారుణమని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం. జగ్గునాయుడు అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కరోనా సాయం ఇస్తామని బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించి 5 నెలలు కావస్తున్నా... ఒక్క రూపాయి కూడా జమ చేయకపోవడాన్ని జగ్గునాయుడు ఖండించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెలో భవన నిర్మాణ కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని సూచించారు. అనంతరం ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ... భవన నిర్మాణ కార్మికుల హక్కులను కాలరాయాలని జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి :