ETV Bharat / city

విశాఖ స్టీల్ ప్లాంట్​ భూములపై అంబానీ, అదానీల కన్ను: వీహెచ్

కేంద్ర ప్రభుత్వ తీరుపై తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్​పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనను తీవ్రంగా ఖండించారు. స్టీల్ ప్లాంట్ భూములపై కన్నేసిన అదానీ, అంబానీలతో ప్రధాని మోదీ అవగాహన కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.

congress senior leader v hanumantha rao
congress senior leader v hanumantha rao
author img

By

Published : Mar 9, 2021, 5:11 PM IST

అదానీ‌, అంబానీ చేతిలో ప్రధాని మోదీ కీలు బొమ్మగా మారార‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి. హ‌నుమంతరావు ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ‌న్ ప్రక‌టించడంపై ఆయ‌న స్పందించారు. విశాఖ స్టీల్ భూములు కోట్లాది రూపాయ‌లు ప‌లుకుతాయని.. ఈ ఆస్తుల‌పై కన్నేసిన అదానీ, అంబానీల‌తో ప్రధాని మోదీ అవ‌గాహ‌న కుదుర్చుకున్నార‌ని ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటుప‌ర‌మైతే...అందులోని ఉద్యోగుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఉండ‌వ‌ని ఆందోళ‌న వ్యక్తం చేశారు. భవిష్యత్తులో బీహెచ్​ఈఎల్, ఈసీఐఎల్‌ల‌ను కూడా అమ్మేస్తార‌ని.. ఈ ప‌రిస్థితుల్లో ప్రభుత్వ సంస్థలను కాపాడుకునేందుకు పెద్దఎత్తున ఉద్యమం చేయాల్సి ఉంద‌న్నారు.

మోదీ రిమోట్ కంట్రోల్.. అదానీ, అంబానీల‌ చేతిలో ఉందని విమ‌ర్శించారు. విశాఖ ఉక్కును కాపాడుకోకపోతే.. ప్రజలు క్షమించర‌ని, ఇందుకోసం కాంగ్రెస్ భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి

రాజీనామాలు చేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా: మంత్రి పెద్దిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.