ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యక్ష పోరాటాలు చేస్తూ ప్రభుత్వంతో సక్రమంగా పని చేయించడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీఏ నారాయణ రావు అన్నారు. విశాఖలో కాంగ్రెస్ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏ పార్టీని విమర్శించకుండా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసి పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. గ్రామ, వార్డు, పట్టణ, జిల్లా స్థాయిలో కార్యకర్తలంతా ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వం అలసత్వం వహిస్తోన్న విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి అవకాశాలపై సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని చెప్పారు.
ఇదీ చదవండి: