Complaint on Avanti: విశాఖలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుపై డీసీపీకి ఫిర్యాదు అందింది. ముత్తంశెట్టిపై జర్నలిస్టు ఆకెళ్ల రవిగణేశ్ డీసీపీ సుమిత్ సునీల్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును డీసీపీ... లీగల్ సెల్‌కు పంపించారు. ఈనెల 16న కోరాడలో రైతు బహిరంగ సభలో పాల్గొన్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు... సభా వేదికపై రవిగణేశ్ను ఒరేయ్ పంతులంటూ దూషించారని ఫిర్యాదు చేశారు. అవంతి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రవిగణేశ్ డీసీపీకి ఫిర్యాదు చేశారు.
ఇదీ జరిగింది: ఈనెల 16న విశాఖ జిల్లా పద్మనాభం మండలం కోరాడలో రైతు బహిరంగ సభలో పాల్గొన్న మాజీ మంత్రి అవంతి... మీడియా ప్రతినిధులు, పోలీసులపై మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రెచ్చిపోయారు. రైతు భరోసా నిధులు విడుదల సభలో పాల్గొన్న ఆయన.. జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ సాక్షిగా.. ఓ ఎస్సైని ‘ఏం డ్యూటీ చేస్తున్నావయ్యా’ అంటూ ఎగతాళిగా మాట్లాడారు. అంతటితో ఆగకుండా ఓ మీడియా ప్రతినిధిపై ‘నీ సంగతి చూస్తా’ అంటూ.. చేయి చూపించి కులం పేరుతో దూషించారు. మాజీ మంత్రి తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇవీ చదవండి: