ETV Bharat / city

7000 ఎకరాలు అమ్మితే చాలు ప్రైవేటీకరించక్కర్లేదు : సీఎం జగన్

సీఎం జగన్ విశాఖలో పర్యటించారు. విమానాశ్రయంలో దిగిన ఆయనతో ఉక్కు కర్మాగారం కార్మిక సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఎన్ఎండీసీని ఉక్కు పరిశ్రమతో అనుసంధానం చేయాలని కార్మిక నేతలు కోరారు. ఈ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్..పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు.

vizag steel plant
cm jagan on steel plant
author img

By

Published : Feb 17, 2021, 12:28 PM IST

Updated : Feb 18, 2021, 4:46 AM IST

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాల్సిన అవసరం లేదని.. కర్మాగారంలో నిరుయోగంగా ఉందంటున్న ఏడు వేల ఎకరాల భూమికి ప్రభుత్వం నుంచి అనుమతిచ్చి లేఅవుట్లు, ప్లాట్లు వేసి స్టీల్‌ప్లాంట్‌ ద్వారా విక్రయిస్తే ఒకేసారి ప్లాంటుకు నగదు నిల్వలు పెరిగి, సంపన్నంగా మారుతుందని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలోనూ ప్రస్తావించినట్లు చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో తీర్మానం పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో మరో ఆలోచనకు తావు లేదని, ఈ ప్లాంటును కాపాడుకోవాలనే నిబద్ధతతోనే ఉన్నామని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందన్నారు. ఈలోగానే కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం తనకుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు బుధవారం విశాఖ నగరానికి వచ్చిన ఆయన విమానాశ్రయంలో కార్మిక సంఘాల నాయకులతో మంత్రుల సమక్షంలో సుమారు గంటపాటు చర్చించారు. స్టీల్‌ప్లాంట్‌ కార్మిక సంఘాల నాయకులు ఉక్కు పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి ముందుంచారు. వాటన్నింటినీ విన్న అనంతరం సీఎం మాట్లాడారు. ‘ప్లాంటును సాధించుకున్న విషయాలు, పరిష్కార మార్గాలను సూచిస్తూ ప్రధానమంత్రికి నేను సుదీర్ఘ లేఖ రాస్తే కొందరు లేఖ రాయలేదంటున్నారు. ఒక ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాసి దాన్ని మీడియాకు విడుదల చేస్తే లేఖ రాయలేదని చెప్పే స్థితిలోకి ఆ నాయకులు పోతున్నారంటే వాళ్లను ఏమనుకోవాలి’ అని ప్రశ్నించారు. ‘ప్రధాని కార్యాలయానికి లేఖ అందిన రశీదును చంద్రబాబుకు పంపించాలని కార్మిక సంఘ నేతలుగా మిమ్మల్ని కోరుతున్నా. మీ ద్వారానే వీటిని పంపితే బాగుంటుంది. ఇంత గొప్ప ఆరోపణలు చేస్తున్న వ్యక్తులకు కనీసం ప్రధానికి ఒక లేఖ రాయాలన్న ఆలోచన రాలేదు’ అన్నారు.

ప్రత్యామ్నాయాలన్నీ ప్రస్తావించా...
‘విశాఖ ఉక్కు సమస్యకు తగిన పరిష్కార మార్గాలు వివరిస్తూ ఒక మార్గదర్శక ప్రణాళికను ప్రధానికి రాసిన లేఖలో సూచించా. స్టీల్‌ప్లాంట్‌కు ఉన్న అప్పులు, బ్యాంకులకు చెల్లిస్తున్న వడ్డీలు, సొంత గనులు లేకపోవడం వంటి సమస్యలను వివరించాను. ఒడిశాలో పుష్కలంగా ఇనుప ఖనిజం గనులున్నాయని, అక్కడ విశాఖ స్టీల్‌ప్లాంటుకు సొంత గని కేటాయిస్తే బాగుంటుందని ప్రతిపాదించాను. ఒడిశాలోని గనుల లీజు, ప్రస్తుతం అవి ఏ పరిస్థితుల్లో ఉన్నాయో విచారణ చేయించిన వివరాలన్నింటితో ఒక ప్రతిపాదన సైతం చేశాను. బ్యాంకులు ఎక్కువ వడ్డీలకు ఇచ్చిన రుణాలు ఈక్విటీల రూపంలోకి మారిస్తే వడ్డీల భారం ఎలా లేఖలో పేర్కొన్నాను. స్టీల్‌ప్లాంట్‌లో నిరుపయోగంగా ఉన్న 7వేల ఎకరాల భూమిని లేఅవుటు, ప్లాట్లు వేసి విక్రయిస్తే నగదు నిల్వలు పెరుగుతాయి. ఇలాంటివి కొన్ని అమలు చేస్తే ప్రైవేటుపరం చేయాల్సిన పనిలేదని ప్రభుత్వ రంగంలోనే ఉండి మంచి సంస్థగా మారుతుందని లేఖలో పేర్కొన్నా’ అని సీఎం వివరించారు. ప్రధానికి రాసిన లేఖకు ఇంకా సమాధానం రాలేదు.. కచ్చితంగా వస్తుందని పేర్కొన్నారు. స్థానిక భాజపా నాయకులు స్టీల్‌ప్లాంట్‌ అంశానికి మద్దతివ్వడం మంచిదని, వారంతా కలిసి పెద్దలను ఒప్పిస్తే మన పని మరింత సులభమవుతుందన్నారు. ప్రభుత్వం తరఫున మనకున్న దౌత్యంతో చర్చలు కొనసాగించే కార్యక్రమాలు చేపడదామన్నారు.
ప్లాంట్‌ మూతపడకుండా పనిచేయాలి...
స్టీల్‌ప్లాంట్‌ ఎక్కడా మూతపడకుండా అంతకన్నా మెరుగ్గా నిర్వహించాలని సీఎం కార్మికులను కోరారు. కార్మికుల ఆందోళనల వల్ల ప్లాంట్‌ మూతపడింది.. ఉత్పత్తి సక్రమంగా జరగడం లేదన్న మాట రానీయకుండా చూసుకోవాలన్నారు. పరిశ్రమ సామర్థ్యానికి తగినట్లు నడిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గి లాభాలు మెరుగ్గా చూపించడానికి అవకాశం ఉంటుందన్నారు. దీనికోసం విరామ సమయంలోనే ధర్నాలు, ఆందోళనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉక్కు పరిరక్షణ కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పోస్కో రాష్ట్రానికి రావడం వాస్తవం...
‘పోస్కో ప్రతినిధులు రాష్ట్రానికి రావడం.. నన్ను కలవడం వాస్తవం. కడప, కృష్ణపట్నం, భావనపాడు లాంటి చోట్ల పరిశ్రమ పెట్టమని వారిని కోరా. ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడైనా పర్వాలేదని చెప్పా. మరింత మందికి ఉద్యోగాలు వస్తాయి. మంగళవారం కూడా పోస్కో ప్రతినిధులు కృష్ణపట్నం వెళ్లారు. కృష్ణపట్నం, భావనపాడులో ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తున్నారు. పోస్కో విశాఖకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నది వాస్తవం కాదు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. దీనిపై వారితో చర్చలు జరుపుతాం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది ప్రైవేటీకరణ కాకుండా తగిన రీతిలో ఒత్తిడి తెస్తున్నాం. అందరం కలిసికట్టుగా ఒక్కటై.. దిల్లీ నాయకుల మనసులు సానుకూలంగా మార్చేలా చేసుకుందాం’ అని ముఖ్యమంత్రి కార్మికులకు భరోసా ఇచ్చారు. అనంతరం కార్మికసంఘాల నాయకులు ఇచ్చిన వినతిపత్రాలు స్వీకరించారు. కార్మిక సంఘాల నాయకులు మంత్రి రాజశేఖర్‌, జేవీ సత్యనారాయణమూర్తి, ఆదినారాయణ తదితరులతో కూడిన 11 మంది ఆయన్ను కలిశారు.

ఇదీ చదవండి

కార్పొరేటర్​గా పోటీ చేస్తున్న తెదేపా మహిళ అభ్యర్థిపై దాడి

Last Updated : Feb 18, 2021, 4:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.