విశాఖ నగరంలో త్వరలో సీఎం కప్ బాక్సింగ్ పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని రాష్ట్ర మారి టైం బోర్డ్ చైర్మన్ కాయల వెంకటరెడ్డి అన్నారు. విశాఖ నగరంలో ఆంధ్ర బాక్సింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా కాయల వెంకటరెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో విశాఖ క్రీడాకారులు చక్కని గుర్తింపు పొందారని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో బాక్సింగ్ క్రీడకు కేరాఫ్ అడ్రస్‌గా విశాఖ నిలుస్తుందని అన్నారు. బాక్సింగ్ క్రీడా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో జీసీసీ ఛైర్పర్సన్, ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు శోభా స్వాతి రాణి, విశాఖ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్లాపు రఘురామ్, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్ సంచాలకుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Steel plant: దేశ ఆర్థిక అవసరాల కోసం తీసుకున్న నిర్ణయాలపై.. విచారణ తగదు: కేంద్రం